నిజ జీవితంలో హీరో కాబోయిన విలన్
సినిమాల్లో సాధారణంగా విలన్ వేషాలు వేసే బి. రాఘవేంద్ర అనే టాలీవుడ్ నటుడు బి. రాఘవేంద్ర నిజ జీవితంలో హీరో కాబోయి తప్పులో కాలేశాడు. ఓ ఆడమగ వాదులాడుకుంటూ, కయ్యం పెట్టుకుంటూ వెళ్తుంటే, పురుషుడు మహిళను వేధిస్తున్నాడని భావించి ఆ నటుడు జోక్యం చేసుకున్నాడు. పురుషుడిని కొట్టేశాడు కూడా. అయితే, అది ఎదురు తిరిగింది. వారిద్దరు భార్యాభర్తలని తెలియక రాఘవేంద్ర ఆ పనిచేశాడు. మహిళ పోలీసులను పిలిచి రాఘవేంద్రపై ఫిర్యాదు చేసింది.
నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాదులోని ఓ రెస్టారెంట్‌లో రాఘవేంద్ర మిత్రులతో కలిసి మద్యం తీసుకున్నాడని, భార్యాభర్తలు వాదులాటకు దిగడం చూసి రాఘవేంద్ర జోక్యం చేసుకున్నాడని, భర్తను రాఘవేంద్ర కొట్టాడని, తన ముఖుల్ చంద్‌ను రాఘవేంద్ర కొడుతుండడంతో భార్య సోనియా ముఖుల్ చంద్ వాష్‌రూంలోకి వెళ్లి తమను పిలిచిందని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం రాఘవేంద్ర పోలీసు స్టేషనుకు వెళ్లాల్సి ఉంది.


Click it and Unblock the Notifications