twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైర్ బ్రాండ్ హేమ సినీ పరిశ్రమ నుంచి ఔట్... ‘మా’ సంగతేంటి?

    |

    Recommended Video

    Actress Hema Interesting Comments On AP CM YS Jagan

    తెలుగు సినీ పరిశ్రమలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో చురుకుగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు మద్దతుగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటున్న ఆమె... ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

    ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో నటిగా, నాయకురాలిగా రాణిస్తూ వస్తున్న ఆమె త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హేమ ఈ ప్రకటన చేశారు. సినిమాల్లో ఆదరిస్తున్నట్లే రాజకీయాల్లోనూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

    కాపుల సమస్యలపై హేమ పోరాటం

    కాపుల సమస్యలపై హేమ పోరాటం

    హేమ కొంతకాలంగా తన కాపు కమ్యూనిటీ తరుపున వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఏపీ బడ్జెట్లో కాపుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

    రాజమండ్రికి షిప్ట్ అవుతున్న హేమ

    రాజమండ్రికి షిప్ట్ అవుతున్న హేమ

    పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నందున రాజమండ్రిలోనే సెటిలవ్వాలని డిసైడ్ అయినట్లు హేమ తెలిపారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో సొంతగా ఇల్లు కట్టుకుంటున్నట్లు, ఇకపై తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడంతో పాటు కాపుల సమస్యలపై పోరాటం చేయబోతున్నట్లు తెలిపారు.

    అందుకే సినీ పరిశ్రమను వీడి బయటి ప్రపంచంలోకి

    అందుకే సినీ పరిశ్రమను వీడి బయటి ప్రపంచంలోకి

    నా సినీ పరిశ్రమను, హైదరాబాద్‌లో ఉంటున్న నా ఫ్యామిలీని వదిలి నేను ఉండగలనా? లేదా? మీరు(ప్రజలు) నన్ను రమ్మంటున్నారా? లేదా? అనేది నాకు తెలియడం లేదు. వీటిపై నాకు సరైన క్లారిటీ రావాలనే ఒక అడుగు ముందుకు వేసి సినీ పరిశ్రమను వీడి బయటి ప్రపంచంలోకి వస్తున్నట్లు హేమ స్పష్టం చేశారు.

    గతంలో పోటీ చేసి ఓడిపోయిన హేమ

    గతంలో పోటీ చేసి ఓడిపోయిన హేమ

    హేమ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. వైసీపీ తరుపునే ఆమె రాజకీయాలు చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో హేమ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ' తరుపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

    ‘మా' సంగతేంటి?

    ‘మా' సంగతేంటి?

    ఇటీవల కొత్తగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌లో హేమ కీలకమైన ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరి హైదరాబాద్ వదిలి రాజమండ్రికి షిప్ట్ అవుతున్న తరుణంలో ఆమె ‘మా'కు కూడా దూరం అవుతారా? లేక ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

    English summary
    Hema to leave the film industry and planning to enter politics. Hema is a character actresses in Telugu film industry colloquially referred to as Tollywood in Tollywood comedian and character artist who has acted in more than 250 films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X