నల్లోడు, కర్రోడు, ఎంత ఆస్తి ఉందో కూడా తెలియదు: రజనీకాంత్ గురించి...
Recommended Video

ఇపుడు రజనీకాంత్ పెద్ద సూపర్ స్టార్. కానీ ఒకప్పుడు ఇదే రజనీకాంత్ బస్సు కండక్టర్‌గా పని చేసి పొట్ట పోసుకున్న సంగతి తెలిసిందే. యాక్టింగ్ మీద ఇంట్రెస్టుతో కర్నాటక నుంచి తమిళనాడు వచ్చి అవకాశాలు దక్కించుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు.
తెలుగు నటుడు హేమసుందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రజనీకాంత్‌తో ఉన్న అనుబంధాన్ని హేమసుందర్ గుర్తు చేసుకున్నారు.

రజనీకాంత్ గారు కాదు... నల్లోడు, కర్రోడు!
మీరు రజనీకాంత్ గారిని స్కూటర్ మీద తీసుకెళ్లేవారంట కదా... అనే ప్రశ్నకు హేమసుందర్ స్పందిస్తూ ‘‘అపుడు రజనీకాంత్ గారూ కాదు... నల్లోడు, కర్రోడు. కానీ రజనీ బంగారం. చాలా మంచి వాడు. నా స్కూటర్ ఎక్కే ముందు నీకు ట్రబుల్ ఇస్తున్నాను అనేవాడు... ట్రబుల్ ఏముంది, నేనేమైనా భుజాల మీద మోస్తున్నానా? కూర్చో అనేవాడిని.'' అని గుర్తు చేసుకున్నారు.

ఎంత ఆస్తి ఉందో అతడికే తెలియదు
రజనీకాంత్ సింప్లిసిటీ గురించి మాట్లాడుతూ... రజనీకాంత్ మల్టీ కరోడ్‌పతి, వాడికి ఎంత ఆస్తి ఉందో వాడికే తెలియదేమో? రజనీకాంత్ రిచ్ అని అందరికీ తెలుసు. ఆ రిచ్ నెస్ ఎక్కాడా షో చేయడు, డబ్బుందనే పొగరు ఒంట్లోకి వెళ్లడం లాంటిది లేదు. చాలా నార్మల్ పర్సన్‌గా ఉంటాడని హేమసుందర్ తెలిపారు.

నిజ జీవితంలో నటించడు
ఇప్పటికీ సెట్‌కు వచ్చాడంటే లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరినీ పలకరిస్తాడు. ఒక్కసారి మనిషిని చూసినా, అతడి పేరు విన్నా అలా గుర్తు పెట్టుకుంటాడు. రజనీకాంత్ లాంటి స్టార్ లైట్ బాయ్ భుజం మీద చెయ్యేసి ఏరా... ఎలా ఉన్నావ్ అని అడిగితే ఎలా ఉంటుంది? దటీజ్ రజనీ.. అది యాక్టింగ్ కాదు. ఎవరైనా ఒకసారి, రెండు సార్లు జీవితంలో యాక్ట్ చేస్తాం, జీవితాంతం అలా ఉండలేం. అతడికి రియల్ లైఫ్ లో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు

జెట్‌లాగా ఎక్కడికో...
స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆయన్ను కలవడం జరిగిందా? అంటే.... వాడి కోసం ప్రత్యేకంగా వెళ్లలేదు. అలా అని పక్కన ఎక్కడైనా రజనీకాంత్ ఉన్నాడంటే కలవకుండా ఉండను. వెన్ రజనీ వాజ్ కర్రోడు.... చాలా హ్యాపీగా ఉండేవాడు. కొన్ని విషయాలు చెప్పకూడదు, బావుండదు. అంత క్లోజ్. చూస్తుండగానే జెట్ లాగా ఎక్కడికో వెళ్లిపోయాడు. చాలా సంతోషం వేసింది. దేవుడు అతడిని దీవించాడు... అని హేమ సుందర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











