twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో విషాదం.. 1000 చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు కన్నుమూత

    |

    తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకొన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందిస్తున్న సీనియర్ నటుడు జనార్ధనరావు ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. జనార్ధనరావు మృతికి మా అసోసియేషన్‌తో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జనార్ధనరావు సినీ జీవితం గురించి మరిన్ని వివరాలు..

    40 ఏళ్లుగా ఇండస్ట్రీలో

    40 ఏళ్లుగా ఇండస్ట్రీలో

    గుంటూరు జిల్లాలోని పోనిగళ్ల గ్రామం జనార్ధన్‌రావు స్వస్థలం. తెలుగు సినిమా పరిశ్రమ, నటనపై మక్కువతో జనార్ధన్ రావు 40 ఏళ్ల క్రితం చెన్నైకి చేరుకొన్నారు. చిన్న చిన్న వేషాలతో ప్రతిభను నిరూపించుకొంటూ నటుడిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ లాంటి దిగ్గజ తరంతోనే కాకుండా నేటి తరం యువ హీరోల చిత్రాల్లో కూడా నటించారు. ఇటీవల కాలంలో జనతా గ్యారేజ్ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

     1000కి పైగా చిత్రాల్లో

    1000కి పైగా చిత్రాల్లో

    తెలుగు వినోద పరిశ్రమలో సుదీర్ఘంగా సేవలందించిన జనార్ధన్ రావు 1000కి పైగా చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్‌లో కూడా కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్‌తో కొండవీటి సింహం, చిరంజీవితో గోరింటాకు తదితర చిత్రాల్లో, శోభన్‌బాబుతో గోరింటాకు, ఇతర చిత్రాల్లో జానకి రాముడు చిత్రంలో నాగార్జున లాంటి అగ్రహీరోల చిత్రాల్లో కనిపించారు. గోకులంలో సీత, తలంబ్రాలు లాంటి టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు.

    సినీ పరిశ్రమలో పలు సేవలు

    సినీ పరిశ్రమలో పలు సేవలు

    నటుడిగానే కాకుండా సినీ కార్మికులకు సంబంధించిన సంఘాలతో కూడా కలిసి పనిచేశారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌లో పలు హోదాల్లో సేవలందించారు. తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉంటే జనార్ధన్ రావు మరణించిన వార్త తెలిసిన వెంటనే పలువురు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

    Recommended Video

    Screenplay Movie Public Talk | Vikram Shiva | Pragathi Yadhati | Filmibeat Telugu
    మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

    మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

    టాలీవుడ్ ప్రతిభావంతుడైన సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి వార్త తెలిసిన వెంటనే వారు స్పందించారు. జనార్ధన్ రావుతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు బెనర్జీ. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ని ప్రకటించారు.

    English summary
    Senior Actor of Tollywood no more, Actor P janardhana rao died prolonged illness. He acted more than 1000 movies in Telugu industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X