యాంకర్‌తో విడిపోయి రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ కమెడియన్!
Recommended Video

టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడు రెండవ వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తన మాజీ భార్య నటి, యాంకర్ అయిన ఝాన్సీ నుంచి జోగినాయుడు విడిపోయిన సంగతి తెలిసిందే. ఝాన్సీ నటిగాను, యాంకర్ గా టాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక జోగినాయుడు పలు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

విభేదాలు
వ్యక్తిగత జీవితంలో విభేదాలు తలెత్తడంతో ఝాన్సీ, జోగినాయుడు 2014 లో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తె జాన్సీ వద్దనే ఉంది. విభేదాలు ముదరకుండా ఎవరి జీవితం వారు గడపాలని అప్పట్లో విడిపోయినట్లు జోగినాయుడు ఓ సంధర్భంలో వివరించాడు.

రంగస్థలం వరకు
జోగినాయుడు సుకుమార్ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాడు. కార్తికేయ, స్వామిరారా ఇలా పలు చిత్రాలలో జోగినాయుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రంగస్థలం చిత్రంలో కూడా జోగినాయుడు జగపతి బాబుకు సేవలు చేసే వ్యక్తిగా నటించాడు.

రెండవ వివాహం
ఝాన్సీ నుంచి విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న జోగినాయుడు తాజాగా రెండవ వివాహం చేసుకున్నాడు. విశాఖ లోని తన స్వగ్రామం చెర్లోపాళేనికి చెందిన యువతిని జోగినాయుడు రెండవ వివాహం చేసుకున్నాడు.

యాంకర్‌గా, నటిగా
ఇక ఝాన్సీ అటు యాంకర్ గా, నటిగా టాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. నెల్లూరు, తెలంగాణ ఎలాంటి యాసలో అయినా డైలాగులు చెబుతూ ఆకట్టుకోవడం ఝాన్సీ ప్రత్యేకత. బుల్లితెరపై, సినిమా వేడుకలో యాంకర్ గా రాణిస్తోంది.


Click it and Unblock the Notifications











