తెలుగు చిత్రసీమలో విషాదం.. టాలీవుడ్ నటుడు మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు జాన్ కొట్టోలీ మృతిచెందాడు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలిసింది.
ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన మాస్ సినిమా 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో నటించాడు జాన్ కొట్టోలీ. అలాగే దాదాపు రెండేళ్ల క్రిందట బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా వచ్చిన 'మను' సినిమాలోను ఆయన కీలక పాత్ర పోషించాడు. వీటితో పాటుగా మిస్టర్ అమాయకుడు, కళాకారుడు లాంటి షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించాడు. కొత్తరకం సినిమాలు, నటనతో తెలుగు ప్రేక్షకులను ఇప్పుడిప్పుడే ఆకట్టుకుంటున్న జాన్ కొట్టోలీ ఆకస్మిక మరణంతో తెలుగు సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జాన్ కొట్టోలీ మరణవార్త తెలిసి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. యంగ్ దర్శకుడు సాయి రాజేశ్‌తో పాటు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా సోషల్ మీడియా ద్వారా జాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications











