టాలీవుడ్ హీరో ఎంగేజ్మెంట్ .. పెళ్లి పెద్దగా సీఎం చంద్రబాబు
తెలుగు ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలు, హీరోయిన్స్, నటులు, నటీమణులు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారి కుటుంబాల్లో పెళ్లులు జరుగుతున్నాయి. తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ పెళ్లికి పెళ్లి పెద్దలుగా సీఎం చంద్రబాబు దంపతులు వ్యవహరిస్తున్నారు. నేడు నారా వారి దంపతుల సమక్షంలోనే ఆ టాలీవుడ్ హీరో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరు? ఆ హీరో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో ఓ లూక్కేయండి.
ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు. నారా వారబ్బాయి నారా రోహిత్ (Nara Rohith). ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు కుమారుడే నారా రోహిత్. నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'బాణం' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతడు తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ తరువాత.. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు. మొత్తానికి ఓ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీసే హీరోల్లో ఒకడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాలు బ్రేక్ తీసుకుని ఏడాది 'ప్రతినిధి 2' అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.
ఇక హీరో నారా రోహిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నారా వారి అబ్బాయి నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెట్టబోతున్నారు. ఆయన ఇటీవల నటించిన 'ప్రతినిధి 2' హీరోయిన్ సిరిలెల్లాను నారా రోహిత్ వివాహమాడబోతున్నారు. నేడు హీరో నారా రోహిత్- హీరో సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో నోవాటెల్‌లో ఉదయం 10.45కి గ్రాండ్ గా జరిగింది. నారా రోహిత్- సిరిల వివాహం డిసెంబర్ 15న జరిపించాలని పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు.

ఈ వేడుకకు రోహిత్ పెద్ద నాన్న, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్దగా వ్యవహరించారు. ఈ ఎంగేజ్మెంట్ వేడుక పనులను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దగ్గర ఉండి జరిపించారు.రోహిత్ సోదరుడు ఏపీ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు, ఇంకా నారా వారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే.. సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. లేటుగా అయినా లేటెస్ట్ గా ఓ ఇంటివాడు కాబోతున్నందుకు నారా రోహిత్ కు ఫ్యాన్స్ కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











