సామ్రాట్‌లో మరో కోణం: అతనో 'బైసెక్సువల్'?.. భార్య పక్కనుండగానే!..

Recommended Video

సామ్రాట్‌లో మరో కోణం.. అతనో 'బైసెక్సువల్' ?

నటుడు సామ్రాట్ రెడ్డిలో బయటకు కనిపించని కోణాలు చాలానే ఉన్నాయా?.. పైకి జెంటిల్‌మెన్‌లా పోజు కొడుతూ అవలక్షణాలన్నీ ఒంటపట్టించుకున్నాడా?.. సామ్రాట్ భార్య, అతని మామ చేస్తున్న ఆరోపణలు వింటుంటే బహుశా ఇవన్నీ నిజమేనేమో అనిపించకమానదు.

 మరో కోణం:

మరో కోణం:

డ్రగ్స్, సెక్స్.. ఈ రెండు సామ్రాట్‌కు వ్యసనంగా తయారైనట్లు అతని భార్య హర్షితా రెడ్డి, మామ ఆరోపిస్తున్నారు. కాల్ గర్ల్స్‌తో సంబంధాలు మాత్రమే కాకుండా.. విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలతోనూ సామ్రాట్ సంబంధం పెట్టుకున్నాడని అతని మామ ఆరోపించారు. అంతేకాదు, సామ్రాట్‌కు ఒక 'గే' ఫ్రెండ్ ఉన్నాడని, సామ్రాట్ ఒక 'బైసెక్సువల్' అని ఆరోపించారు.

 వదిలి ఉండకపోయేవాడు..:

వదిలి ఉండకపోయేవాడు..:

సామ్రాట్, అతని గే ఫ్రెండ్ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరని అతని మామ ఆరోపించారు. హుక్కాకు సామ్రాట్ బాగా ఎడిక్ట్ అయ్యాడని, పద్దతి మార్చుకోవాలని చెప్పితే.. వెకిలిగా ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయేవాడని అన్నారు.

హర్షితా రెడ్డి ఆవేదన..:

హర్షితా రెడ్డి ఆవేదన..:

అమ్మాయిలతో సంబంధాల గురించి సామ్రాట్ తల్లికి చెప్పితే.. ఆమె తననే దబాయించిందని హర్షితా రెడ్డి అన్నారు. కొడుకుకి బుద్ది చెప్పాల్సిందిపోయి.. 'ఊరి నుంచి వచ్చినవాళ్లకు ఏమి తెలుస్తాయి.. ఇది బంజారాహిల్స్.. ఇక్కడ ఇలాగే ఉంటారు' అంటూ తనకే క్లాస్ పీకేదని అన్నారు.

శారీరకంగా.. మానసికంగా హింసించాడు..:

శారీరకంగా.. మానసికంగా హింసించాడు..:

బయటకు వెళ్లినప్పుడు తనపట్ల విపరీతమైన ప్రేమ కనబరుస్తున్నట్లు నాటకాలు ఆడేవాడని, ఇంటికొచ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించేవాడని హర్షితా తెలిపారు. ఎప్పటికైనా మారుతాడన్న ఆశతో సామ్రాట్ గురించి ఎన్ని విషయాలు తెలిసినా, మనసులో బాధపడ్డానే తప్ప బయటపెట్టలేదని, చాన్నాళ్లు ఎదురు చూశానని హర్షిత వాపోయింది.

 భార్య పక్కనుండగానే..:

భార్య పక్కనుండగానే..:

వద్దంటున్నా వినకుండా బలవంతంగా తనను కొన్నిసార్లు హుక్కా సెంటర్ కు తీసుకెళ్లాడని హర్షితా రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. బయటకు వెళ్లినప్పుడు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి, లేడీ డ్రైవర్ మాదిరిగా చూస్తుండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన పక్కన కూర్చొనే వేరే అమ్మాయిలను ఫ్లర్ట్‌ చేసేవాడని వాపోయారు.

షేర్లు బదిలీ చేయమని..:

షేర్లు బదిలీ చేయమని..:

తన తండ్రి షేర్లను సామ్రాట్ పేరు మీదికి బదిలీచేయమని ఒత్తిడి చేశాడని, అందుకు అంగీకరించకపోవడంతో గత ఏడాది నుంచి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని హర్షితా తెలియజేశారు.

పెద్ద మనుషులు ఈ సమస్యను పరిష్కరించడానికి చూసినా.. అది కుదరలేదని అన్నారు. సామ్రాట్ తరుపున కేసును ప్రభావితం చేయడానికి బడా బాబులు రంగంలోకి దిగినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X