పాలిటిక్స్ లోకి రాబోతున్న కమెడియన్ సప్తగిరి.. ఆ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం అంటూ..
సినిమా ఇండస్ట్రీలో నటులుగా మంచి గుర్తింపు అందుకున్న వారు ఆ తరువాత రాజకీయల్లోకి రావడం అనేది సర్వసాధారణమైన విషయం అని చెప్పవచ్చు. ఇక ఆ రూట్లో సక్సెస్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఏమాత్రం క్రేజ్ వచ్చినా కూడా ఓ వైపు సినిమాల్లో కొనసాగుతూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా గ్యాప్ లేకుండా బిజీ అవుతూ ఉంటారు. ఇక ఇటీవల మరో సినీ నటుడు కూడా పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఆ నటుడు ఎవరా అని ఎదురుచూస్తున్న సమయంలో కమెడియన్ సప్తగిరి క్లారిటీ ఇచ్చాడు. తిరుపతి జిల్లాలో ఇటీవల సప్తగిరి తనా రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అతను తెలుగు దేశం పార్టీలోకి చేరబోతున్నట్టు కూడా వివరణ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా అలాగే హీరోగా వివిధ రకాల పాత్రలు చేసిన సప్తగిరి ఇప్పుడు మొత్తానికి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లు వివరణ ఇచ్చారు.

తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సప్తగిరి సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అతను ఊహించని విధంగా తన రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని పోటీకి సిద్ధంగా ఉన్నాను అని ముందుగానే క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సప్తగిరి.. నేను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే అని పేదల కష్టాలు నాకు తెలుసు అని అన్నారు. అలాగే పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తాను అంటూ.. చంద్రబాబు, లోకేష్ లు ఏమీ ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. టీడీపీ అధికారంలో రావడానికి నా సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్త శుద్ధితో పనిచేస్తానని అనడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యాయి. మరి సప్తగిరి తదుపరి రాజకీయా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











