twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ల ఫాల్టే, కథలు గొప్పగా చెబుతారు... ‘వినయ విధేయ రామ’ అలా అయ్యేదా?

    |

    ఈరోజుల్లో, అరవింద్ 2, రయ్ రయ్ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన శ్రీ వరుస పరాజయాలు ఎదురు కావడంతో సినిమాలు చేయడంలో వెకబడిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీ మాట్లాడుతూ పెయిల్యూర్లకు కారణం తప్పుడే నిర్ణయాలే అన్నారు. సినిమా బావుంటే ప్రేక్షకులు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారని తెలిపారు.

    ఇండస్ట్రీలో మనం సరైన దారిలో నడవాలంటే.. మన వెనక ఎవరైనా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండి ఇది చేయ్, అది చేయ్ అని గైడెన్స్ ఇవ్వాలి.. లేదా మనకైనా ఎలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి అనేదానిపై అవగాహన ఉండాలి. నాకు ఈ రెండు లేవని తెలిపారు.

    ఎవరి సపోర్ట్ లేదు

    ఎవరి సపోర్ట్ లేదు

    నేను ఎంబీఏ అయిపోయాక కొంతకాలం కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేశాను. సినిమాలపై పిచ్చితో ఇటు వైపు వచ్చాను. అయితే సినిమాలపై పాషన్ ఉంది కానీ ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో తెలియదని, ఎవరి సపోర్ట్ లేదని తెలిపారు.

    మూడు మంచి సినిమాలే...

    మూడు మంచి సినిమాలే...

    ‘ఈరోజుల్లో' తర్వాత శేఖర్ సూరి దర్శకత్వంలో ‘అరవింద్ 2' సినిమా చేశాను, ఇది చిన్న సినిమా ఏమీ కాదు. ఆ తర్వాత ‘రయ్ రయ్' కమర్షియల్‌గా మంచి బడ్జెట్‌తో చేసిందే. కథలు బావున్నాయి. డిఎస్ రావుగారు పిల్ల జమిందార్ హిట్ కొట్టిన తర్వాత ఈ సినిమా చేశారు. వరుసగా మూడు సినిమాలు. ఈ మూడింటిలో ఏది రాంగ్ డెసిషన్ అంటే ఏం చెప్పగలం... అని వ్యాఖ్యానించారు.

    అంతా డైరెక్టర్ల ఫాల్టే

    అంతా డైరెక్టర్ల ఫాల్టే

    సినిమా ఫెయిల్యూర్ అయిదంటే అది డైరెక్టర్ ఫాల్టే. వారు ఏం చెబితే హీరో అదే చేస్తాడు. డైరెక్టర్ చేసేది కరెక్టా? కాదా? అని తెలియాలంటే నాకు డైరెక్షన్ రావాలి. నాకు రాదు కాబట్టి కెప్టెఫ్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ చెప్పేది చేసుకుంటూ వెళ్లిపోతాను. నేను ఇలా మాట్లాడిన తర్వాత కూడా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయా? లేదా? అంటే వస్తాయనే అనుకుంటున్నాను అని శ్రీ తెలిపారు.

    స్టోరీ అద్భుతంగా చెబుతారు, ఊహల్లో తేలిపోయేలా చేస్తారు

    స్టోరీ అద్భుతంగా చెబుతారు, ఊహల్లో తేలిపోయేలా చేస్తారు

    డైరెక్టర్లు స్టోరీలు చెప్పేటపుడు అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ కలిగిస్తారు. మన క్యారెక్టరైజేషన్ చెప్పేపుడైతే చాలా నీట్‌గా, మనం ఊహల్లో తేలిపోయేలా చేస్తారు. కానీ రియాల్టీలో చాలా వరకు అలా ఉండదని తెలిపారు.

     ముందే తెలిస్తే వినయ విధేయ రామ లాంటివి ప్లాప్ అవ్వవు కదా...

    ముందే తెలిస్తే వినయ విధేయ రామ లాంటివి ప్లాప్ అవ్వవు కదా...

    సినిమా చేసేపుడు ఫలితం తెలిసిపోతే పెద్ద పెద్ద సినిమాలు ప్లాప్ అవ్వవుకదా.. ఉదాహరణకు ‘వినయ విధేయ రామ' తీసుకుంటే అందరికీ తెలుసు రామ్ చరణ్, బోయపాటి స్టామినా గురించి, అంతే అంచనాలతో వెళ్లి థియేటర్లో కూర్చుంటాం. కానీ వర్కౌట్ కాలేదు. వారు దీన్ని ముందే ఊహించి ఉంటే మార్చుకునే వారు. ట్రైన్ సీన్ అలా పెట్టారు.. ప్రేక్షకులకు నచ్చవచ్చేమో అని భావించి చేస్తారు. కొన్ని రియాల్టీలో వర్కౌట్ అవ్వవు అని... శ్రీ అభిప్రాయ పడ్డారు.

    English summary
    "If the result is pre-predictable, big films will not be defeated." Tollywood actor Sree about Vinaya Vidheya Rama failure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X