twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు, జైల్లో కరుణానిధి హెల్ప్ చేశారు: సుమన్

    |

    198oల్లో తెలుగు సినిమా రంగంలో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సుమన్ ఉన్నట్టుండి బ్లూఫిలిం కేసులో అరెస్టు కావడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఈ కేసులో ఆయన దాదాపు మూడేళ్లు జైల్లో గడిపారు. అయితే ఆయనపై ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఈ కేసు నుంచి బయట పడ్డారు. ఈ కేసు సుమన్ సినిమా కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపింది.

    అప్పట్లో దీనిపై రకరకాల ప్రచారం జరిగింది. ఆయన్ను ఇందులో ఇరికించింది చిరంజీవి ఫ్యామిలీ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను సుమన్ పలు సందర్భాల్లో ఖండించారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో సుమన్ ఆ కేసు విషయమై ఎదురైన ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చారు.

    చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు

    చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు

    ఈ కేసులో చిరంజీవి, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే వార్తల్లో నిజం లేదు. ఇది చిరంజీవి అంటే పడని వారు చేసిన తప్పుడు ప్రచారం. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ డేట్స్ ఇస్తే మంచివాడు, డేట్స్ ఇవ్వకపోతే చెడ్డవాడు. అలా ఆయనంటే పడనివారు ఈ పుకార్లు పుట్టించారు.

    వారి స్వార్థం కోసం చిరంజీవి మీద ఆరోపణలు

    వారి స్వార్థం కోసం చిరంజీవి మీద ఆరోపణలు

    చిరంజీవితో అప్పట్లో నాకు ఏదో ఇష్యూ ఉండేది. కానీ ఈ కేసుతో ఆయనకు ఎలాంటి లింక్ లేదు. ఆ రోజుల్లో ఇంటర్నెట్, టీవీ ఛానల్స్ లేవు. మేజగైన్లు, పేపర్లు మాత్రమే ఉండేవి. వారు కూడా తమ సర్క్యులేషన్ పెంచకోవడానికి ఇలాంటి వార్తలు రాసేవారు... అని సుమన్ గుర్తు చేసుకున్నారు.

    అలా నేను కేసులో ఇరుక్కున్నాను

    అలా నేను కేసులో ఇరుక్కున్నాను

    వాస్తవానికి ఆ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఫ్రెండ్స్ కొందరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారు నా కారు తీసుకుని అందులో అమ్మాయిని తీసుకెళ్లారు. అదే నాకు పెద్ద సమస్యగా తయారైంది. నేను ఏ తప్పూ చేయలేదని తెలిసి కేసు పెట్టినవారు బాధ పడ్డారు. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.

    జైల్లో కరుణానిధి సహాయం చేశారు

    జైల్లో కరుణానిధి సహాయం చేశారు

    ఆ సమయంలో కరుణానిధి ఏదో పొలిటికల్ వ్యవహారాల్లో జైలుకొచ్చారు. నన్ను టెర్రరిస్టులు, హంతకులు, దేశద్రోహులు, మానసిక ఉన్మాదులు లాంటి ప్రమాదకరమైన చోట ఉంచారు. కరుణానిధి చూసి ఆయన్ను అందులో ఎందుకు పెట్టారు? ఆయన మీద ఇంకా ఏం ప్రూవ్ అవ్వలేదు కదా అని రగడ చేస్తే అప్పడు నన్ను బయటకు తీసుకొచ్చి మామూలు సెల్‌లో పెట్టారు. కరుణానిధి గారి కూతురు కనిమోళి మా మదర్ స్టూడెంట్. నేను పరిచయం కాబట్టి ఆయన నాకు సహాయం చేశారు అని... సుమన్ గుర్తు చేసుకున్నారు.

    నిర్దోషిగా బయటకు వచ్చాను

    నిర్దోషిగా బయటకు వచ్చాను

    1985 మే 19న అరెస్ట్ చేశారు. 1989లో నిర్దోషిగా బయటకు వచ్చాను. నాపై నమోదైన ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ ప్రూవ్ కాలేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. నేరాలు జరిగిన తేదీల్లో నేను సినిమా షూటింగుల్లో ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఒరిజినల్ క్రిమినల్స్‌ను కూడా పోలీసులు పట్టుకోలేక పోయారు.

    రివేంజ్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు

    రివేంజ్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు

    నేను కూడా తర్వాత దాని గురించి పట్టించుకోవడం మానేశాను. సినిమాల్లో మాదిరిగా... నా పరిస్థితికి కారణమైన వారు ఎవరు? అనే రివేంజ్ తీర్చోకోవడం సాధ్యం కాదు కాబట్టి నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగాను అని సుమన్ తెలిపారు.

    English summary
    Tollywood Actor Suman clarify about Mega Star Chiranjeevi Family. Suman said they had no connection with the case. Opponents have created such news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X