డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు హీరో ఉదయ్

By Bojja Kumar

Tollywood actor Uday arrested in drugs case
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ బూతం వీడలేదని మరోసారి స్పష్టం అయింది. పరిశ్రమలో ఎంతో మంది స్టార్స్ డ్రగ్స్‌కు అలవాటయ్యారనే ప్రచారం గత కొంత కాలంగా సాగుతోంది. ఆ మధ్య రవితేజ సోదరులు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో పాటు, మరికొందరు కూడా పోలీసులకు చిక్కారు.

తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. తెలుగు హీరో ఉదయ్‌తో పాటు మరొక నైజీరియన్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసారు. వీరి వద్ద 16 గ్రాముల కొకైన్ లభించినట్లు తెలుస్తోంది. వారిపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

విచారణ అనంతరం వీరిని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. హీరో ఉదయ్ విషయానికొస్తే.....తెలుగులో వచ్చి పరారె, ఫ్రెండ్స్ క్లబ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఉదయ్ ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X