Chiranjeevi: తీవ్రంగా కలచివేసింది.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
Saif Ali Khan: ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లతో హాస్పిటల్ పాలయ్యాడు. గురువారం ఉదయం సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడిన ఓ ఆగంతకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లో కలకలాన్ని సృష్టిస్తోంది. ఈ ఘటనపై హీరో మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ హీరోలు స్పందించారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తితో దాడి జరిగింది.ఆయనపై గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్‌ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో హీరో సైఫ్ అలీఖాన్ కు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో సైఫ్ ను ముంబాయిలోని లీలావతి హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ చికిత్సను పొందుతోన్నాడు. వెన్నెముక పక్కనే తీవ్ర స్థాయిలో గాయంకావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ల ఇంటిలోకి గురువారం ఉదయం ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. ఈ సమయంలో సైఫ్ అలీఖాన్, ఆ దుండగుడు మధ్య జరిగింది. ఈ ఘర్షణలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసినట్టు సమాచారం. ఉదయం రెండున్నర గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో లో కరీనా కపూర్, తైమూర్ మినహా మిగిలిన సైఫ్ అలీఖాన్ కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి దాడి చేయడం కలకలాన్ని సృష్టిస్తోంది.
ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో , మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి తెలిసి తాము షాకయ్యామని అన్నారు. ''సైఫ్ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా''అని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మరోవైపు.. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై జూనియర ఎన్టీఆర్ కూడా స్పందించారు. '' బాలీవుడ్ హీరో సైఫ్ పై దాడి గురించి తెలిసి షాకయ్యా.. ఇది నిజంగా చాలా బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరోవైపు హీరో సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సిని ప్రేమికులు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











