ఫేస్‌బుక్ హ్యాక్: ఆ నటి పేరుతో డబ్బులు గుంజుడు!

సిరి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన సందీప్ ఆమె పేరుతో ప్రముఖుల నుండి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టాడు. పేదలకు చదువులు చెప్పిస్తామని, అనాథలకు అన్నదానం చేస్తామని చెప్పి సిరి పేరుతో రూ. 82 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సిరి పరిశ్రమలో పలువురిని డబ్బులు అడుగుతుందనే విషయం చర్చనీయాంశం అయింది. విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు విషయం ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటనతో షాకైన ఆమె తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఉందనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.
అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ.....తాను అందరినీ డబ్బులు అడుగుతున్నట్లు వార్తలు విని షాకయ్యాను, వెంటనే పోలీసులను ఆశ్రయించాను అని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ...సినీ తారల ఫేస్‌బుక్ అకౌంట్లను హ్యాక్ చేస్తూ, నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, సోషల్ నెట్వర్కింగ్ ఉపయోగించే వాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.


Click it and Unblock the Notifications