Krithi Shetty: అలాంటివి తలుచుకుంటేనే భయం వేస్తోంది.. లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఆందోళన..

Krithi Shetty: ప్రస్తుతం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి రావడం షాక్ కు గురి చేస్తోంది. వాస్తవానికి ఇలాంటి సంచలన ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా ఇటీవల మాలీవుడ్ పై జస్టిస్‌ హేమ కమిటీ అందించిన రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ముందుకు వచ్చి.. తాము కూడా బాధితులమే అంటూ తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకు వచ్చి పంచుకున్నారు. తాజాగా లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారో మీరు కూడా ఓ లూక్కేయండీ.

ఇక తాజాగా తెలుగు చిత్ర సీమలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయన తన దగ్గర పనిచేస్తున్న జూనియర్ డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనీ, మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు, సినీ ప్రముఖులు స్పందించారు. ఇండస్ట్రీలో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.

Tollywood actress krithi shetty shocking comments about metoo issue in film industry

తాజాగా ఈ అంశంపై ఉప్పెన మూవీ హీరోయిన్, నటి కృతి శెట్టి కూడా స్పందించారు. సినీ రంగంలో జరుగుతోన్న పరిమాణాలపై కృతిశెట్టి ఆందోళన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమంటూ తెలిపింది. ఈ ఘటనలో బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలచుకుంటే నిజంగా భయమేస్తోందన్నారు. ఇలాంటి ఘటనల గురించి ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వారు ముందే తెలుసుకోవాలని అన్నారు. ఈ విషయాలపై అవగాహన కూడా మార్పు తీసుకువస్తుందనీ, కాబట్టి మీటూ ఉద్యమం పునరుద్ధరణ సినీ పరిశ్రమలో సానుకూల మార్పును తీసుకవస్తుందని అన్నారు.

నిజానికి ఇలాంటి వాటన్నిటినీ అనుభవించిన వ్యక్తుల అనుభవాల గురించి చదవడం మరింత హృదయ విదారకమైనదనీ, తాను చాలా సెన్సిటివ్ పర్సన్ అంటూ.. ఈ విషయాలన్నింటికీ తాను చాలా కలవరపడ్డానని పేర్కొన్నారు. ఎలాంటి పరిశ్రమ సంబంధాలు లేకుండా నటీగా ఉండాలని కోరుకునే నాలాంటి వ్యక్తికి, మీటూ లాంటి వేధింపుల వార్తలు విన్నప్పుడు ఆందోళన వేస్తోందని తెలిపింది. భవిష్యత్తుల్లో సానుకూల మార్పులు రావాలని ఆమె కోరుకుంది.

Tollywood actress krithi shetty shocking comments about metoo issue in film industry

ఇదిలా ఉంటే.. ఉప్పెన్ బ్యూటీ కృతి శెట్టి మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. పలు ప్రముఖ యాడ్స్ లో కూడా కనిపించి.. మెరిగింది. ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ తో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అలా.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఈ సినిమా రూ .100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడంతో ఈమెకు భారీ పాపులారిటీ లభించింది.

ఈ క్రేజ్ తో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి ఈ అమ్మడు . ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హ్యాట్రిక్ అందుకొని యంగ్ హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరువాత 'ది వారియర్' వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ, వరుస డిజాస్టర్ లు అందుకోవడంతో ఈమెకు అవకాశాలు రాకుండా పోయాయి. ఇటీవల ఏ ఆర్ ఎం అనే సినిమా లో నటించింది. ఈ సినిమా ఆమెకు కం బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఏఆర్‌ఎమ్‌' మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన కేవలం 4 రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం నాగచైతన్య తో కస్టడీ, శర్వానంద్ తో 'మనమే' సినిమాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Read more about: johnny master krithi shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X