twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంబైలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్...నిషేధిత డ్రగ్స్‌తో పట్టుబడ్డ వర్థమాన తార

    |

    టాలీవుడ్‌లో రాణిస్తున్న వర్థమాన తార నైరా షా డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ ఉయోగిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    తెలుగు సినీ పరిశ్రమలో

    తెలుగు సినీ పరిశ్రమలో

    నైరా షా కెరీర్ విషయానికి వస్తే.. 2019లో బుర్రకథ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హో గయా టోటల్ సిపాయ అనే చిత్రంలో నటించారు. ఇక తమిళంలో శ్రీకాంత్, లక్ష్మీరాయ్ జంటగా నటించిన మీరుగా అనే చిత్రంలో కీలక పాత్ర పోషించారు. పలు చిత్రాల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

    నైరా షా బర్త్ డే రోజున

    నైరా షా బర్త్ డే రోజున

    కాగా, నైరా షా ఆదివారం రోజున తన బర్త్‌డేను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు ఆషీక్ సాజిద్ హుస్సేన్‌తో కలిసి నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకొన్నారు. వారిద్దరూ నైరా షా హోటల్ సూట్‌లో మాదక ద్రవ్యాలు చరస్, డ్రగ్స్‌తో చుట్టబడిన సిగరెట్లు తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.

    శాంతా క్రజ్ పోలీసుల తెలిపిన ప్రకారం

    శాంతా క్రజ్ పోలీసుల తెలిపిన ప్రకారం

    నైరా షా అరెస్ట్‌పై శాంతక్రజ్ పోలీసులు స్పందిస్తూ.. తమకు అందిన సమాచారంతో హోటల్‌ గదికి వెళ్లాం. వారిని సోదా చేయగా డ్రగ్స్ సేవిస్తూ పట్టు దొరికారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆమెకు డ్రగ్స్ రాకెట్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ ప్రారంభించాం అని వెల్లడించారు.

    ఎన్సీబీ అధికారుల వివరణ ప్రకారం..

    ఎన్సీబీ అధికారుల వివరణ ప్రకారం..

    నైరా షా, ఆమె స్నేహితుడు సాజిద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 274 ప్రకారం కేసు నమోదు చేశాం. నిషేధిత డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలపై కేసు పెట్టాం. సాజిద్ హుస్సేన్‌పై నేషనల్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశాం అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.

    Recommended Video

    Aishwaryabhimasthu Movie Team Chit Chat | Arya | Tamannah | Santhanam
    నిషేధిత డ్రగ్స్ ఉపయోగించినట్టు

    నిషేధిత డ్రగ్స్ ఉపయోగించినట్టు

    అరెస్ట్ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు నైరా షాను, సాజిద్ హుస్సేన్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాం. బర్త్ డే పార్టీలో నిషేధిత డ్రగ్స్‌ను ఉపయోగించినట్టు రిపోర్టులో వెల్లడైంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వీరికి వచ్చాయనే విషయాన్ని ఆరా తీస్తున్నాం అని అధికారులు తెలిపారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు అని తెలిసింది.

    English summary
    Tollywood Actress Naira Shah arrested with banned drugs at Mumbai. As per report, The Narcotics Control Bureau (NCB) on Sunday arrested south actress Naira Shah and her friend Ashiq Sajid Husain following consumption of charas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X