పార్వతి మెల్టన్ వెడ్డింగ్ కార్డ్ (ఫోటో)
ముంబై: హీరోయిన్ పార్వతి మెల్టన్ త్వరలో తన ప్రియుడు శంషు లలానీని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 29న గ్రాండ్ గా వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డ్స్ కూడా రెడీ అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ వీక్షించవచ్చు. ఈ నెల 29న ముంబై నగరం వర్లీ ప్రాంతంలోని ఫోర్ సీజన్స్ అనే స్టార్ హోటల్ లో రాత్రి 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రిసెప్షన్ ఏర్పాటు చేసారు.
శంషు లలానీ ముంబై నగరానికి చెందిన బిల్డర్. కొన్ని సంవత్సరాల క్రితం వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 'వెన్నెల', 'మధుమాసం', 'జల్సా', శ్రీమన్నారాయణ లాంటి చిత్రాల్లో నటించిన పార్వతి మల్టన్ కెరీర్ మొదటి నుంచి నిరాశజనకంగానే ఉంది. దీంతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వాలని డిసైడ్ అయింది పార్వతి.
పార్వతి మెల్టన్ నటించిన 'యమహో యమ' చిత్రం ఇటీవల విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. యముడ్ని కొత్తకోణంలో చూపిస్తూ, అమెరికాకు వెళ్లిన యముడు అక్కడ చేసే సందడిని వినోదాత్మకంగా 'యమహో యమ:' చిత్రం కోసం తెరకెక్కించారు. అయినప్పటికీ ఈచిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సాయిరామ్ శంకర్, పార్వతి మెల్టన్, సంజన నాయకానాయికలుగా, యమధర్మరాజుగా శ్రీహరి ప్రధాన పాత్రలో నటించారు. జి.వి.కె.ఆర్ట్స్ పతాకంపై జితేందర్.వై. దర్శకత్వంలో జి.విజయ్‌కుమార్‌గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: ప్యాట్రిక్ (యుఎస్‌ఎ), సంగీతం: మహతి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: వి.ఎన్.మణి, లైన్ ప్రొడ్యూసర్స్: అమీషా ఎంటర్‌టైన్‌మెంట్స్.

హీరోయిన్ పార్వతి మెల్టన్ త్వరలో తన ప్రియుడు శంషు లలానీని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 29న గ్రాండ్ గా వీరి వివాహం జరుగనుంది.

ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డ్స్ కూడా రెడీ అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ వీక్షించవచ్చు.

ఈ నెల 29న ముంబై నగరం వర్లీ ప్రాంతంలోని ఫోర్ సీజన్స్ అనే స్టార్ హోటల్ లో రాత్రి 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రిసెప్షన్ ఏర్పాటు చేసారు.


Click it and Unblock the Notifications











