రాంగ్ రూట్‌లో వెళ్లి రచ్చ చేసిన తెలుగు సినీనటి.. అడిగిన హోంగార్డుపై దాడి!

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు పడే ఇబ్బందులు మరెవరూ పడరు కావచ్చు. ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు డ్యూటీలు చేసే వాళ్లకు మందుబాబులు చూపించే చుక్కలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అయితే తాజాగా ఓ ముద్దుగుమ్మ ట్రాఫిక్ హోంగార్డుపై దాడికి దిగింది. ముఖ్యంగా రాంగ్ రూట్ లో వచ్చావు ఎందుకని అడిగితే అతడిపై దాడి చేసింది. డ్రెస్ చింపేసి మరీ అతడిని కొట్టింది. అయితే ఆ దాడికి పాల్పడింది మరెవరో కాదు తెలుగు నటి అని పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరు ఆ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బంజారా హిల్స్‌లో ట్రాఫిక్ హోంగార్డు మీద ఓ మహిళ దాడి చేసింది. ముఖ్యంగా రాంగ్ రూట్ లో వచ్చి వీరంగం సృష్టించింది. జాగ్వర్ కార్ లో ఉన్న ఆమె రాంగ్ రూటులో రావడంతో అడ్డుకున్న హోంగార్డును బూతులు తిడుతూ.. బట్టలు చించి మరీ దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసుపై దాడికి పాల్పడిన కేసును నమోదు చేసుకున్న పోలీసులకు నిందితురాలు ఎవరో తెలిలేదు. కానీ తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Tollywood Actress Sowmya Janu Attack on Traffic Home Guard Check Details

టాలీవుడ్ సినీ నటి సౌమ్య జానునే ఈ పని చేసినట్లు ఆమే నేరుగా ఒప్పుకుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి వివరించింది. ముఖ్యంగా తాను అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్ లో వెళ్లానని.. అడ్డుకున్న హోంగార్డు తనను బూతు మాటలు తిట్టడంతో... తాను ఆగ్రహానికి గురైనట్లు చెప్పుకొచ్చింది. వెంటనే తాను కూడా కిందకు దిగి అతడిని తిట్టానని, దాడికి కూడా పాల్పడ్డానని చెప్పింది. అలాగే బట్టలు మొత్తం చించానని వివరించింది.

కాస్తో కూస్తో అందరికీ తెలిసిన తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సౌమ్ జాను ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తనను ముందుగా దూషించిన హోంగార్డు మీద కేసు కూడా పెడతానంటూ వ్యాఖ్యానించింది. తాను అంత రచ్చ చేసినా పోలీసులు తనను ఇప్పటి దాకా విచారణకు కూడా పిలవలేదు అని సౌమ్య జాను స్పష్టం చేసింది. తానే స్వయంగా ఒప్పుకోవడంతో సౌమ్య జానుయే నిందితురాలు అని తేలింది. మరి పోలీసులు ఏం చేయబోతున్నారో చూడాలి.

Tollywood Actress Sowmya Janu Attack on Traffic Home Guard Check Details

అయితే సామ్య జాను తెలుగు చిత్ర సీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తడాఖా, చందమామ కథలు, లయన్ వంటి సినిమాల్లో నటించింది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కూడా కనిపించింది. కానీ లెంత్ ఎక్కువగా లేకపోవడంతో ఎక్కువ మందికి తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X