Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతినాయుడు.. ఆ విషయంలో శృంగారతార సస్పెన్స్!
టాలీవుడ్లో సంచలన తార స్వాతినాయుడు ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. ప్రసవం తర్వాత తన బిడ్డతో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకొన్నారు. మాతృత్వం అనుభూతిని పంచుకొంటూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ ఇంటిలోకి చిన్నారి అడుగుపెట్టడంతో స్వాతి నాయుడు దంపతులు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. స్వాతినాయుడుకి పుట్టిన బిడ్డ వివరాలు మరిన్నీ..
2019లో వివాహం
2019లో స్వాతినాయుడు తాను ప్రేమించిన అవినాష్‌ను వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ అనోన్యంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన పెళ్లి తర్వాత హానీమూన్, ఆ తర్వాత శృంగార జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటం సెన్సేషన్‌గా మారింది. తన భార్యకు తగినట్టే అవినాష్ కూడా ఆమెను కెరీర్ పరంగా ప్రోత్సాహిస్తు ఉండటం గమనార్హం.
లాక్డౌన్లో సీమంతం
కొద్ది రోజుల క్రితం స్వాతినాయుడు సీమంతం వేడుక విజయవాడలో నిరాడంబరంగా జరిగింది. లాక్డౌన్లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కొద్ది మంది కుటుంబ సభ్యులు హాజరుకాగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తెల్లవారు జామున పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమెకు పలువురు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆడబిడ్డా? మగబిడ్డ.. సస్పెన్స్
అయితే తనకు పుట్టిన బిడ్డ గురించి స్వాతినాయుడు స్పస్పెన్స్ కొనసాగించారు. పుట్టిన బిడ్డతో కూడిన తన ఫోటోను షేర్ చేసినప్పటికీ.. ఆ బిడ్డ బేబీ బాయ్ లేదా బేబీ గర్ల్ అనే విషయాన్ని సస్పెన్స్‌గా పెట్టారు. త్వరలోనే ఆమె మరిన్నీ వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Recommended Video
త్వరలోనే మళ్లీ మేకప్
ప్రసవం తర్వాత స్వాతి నాయుడు యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగించేందుకు సిద్ధం అవుతున్నట్టు ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. బిడ్డ ఎదిగిన తర్వాత మళ్లీ మేకప్ వేసుకొంటాను. యాక్టింగ్‌తోపాటు కుటుంబ వ్యవహారాలను బ్యాలెన్స్ చేసుకొంటాను. పెళ్లైనప్పటి నుంచి మా కుటుంబాలు సంతానం కోసం పోరు పెట్టారు. అందుకే వారి కోరికను కాదనలేక తల్లిని అయ్యాను. మా ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారి రావడంతో అవినాష్, నా కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది అని స్వాతి నాయుడు తెలిపారు.