ప్రముఖ నటి కమలాదేవి కన్నుమూత

బాలనాగమ్మ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, గుణ సుందరి కథ, కథానాయకుడు, ఇల్లరికం తోడుదొంగలు, పల్లెటూరు, చక్రపాణి, వెలుగు నీడలు, భక్త రాందాసు, బంగారు పంజరం, కంచుకోట, పెత్తందార్లు, అభిమాన వతి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
నాటకాలలో ఆమె వేసిన అలెగ్జాండర్ పాత్ర గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆమెను నాటక కళాపూర్ణ అవార్డుతో సత్కరించింది. కమలదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గా కూడా సేలందించారు. సినిమాలతో పాటు క్రీడల్లో కమలాదేవి రాణించారు. బిలియర్డ్స్ క్రీడలో ఆమె రెండు సార్లు జాతీయ చాంపియన్ షిప్ గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications