శ్రీకృష్ణ కమిటీతో మొదలైన తెలంగాణ లొల్లి-టాలీవుడ్ లో ప్రకంపనలు
శ్రీకృష్ణ కమిటీ ప్రకంపనలు టాలీవుడ్ కి గట్టిగానే తాకుతున్నాయి. కమిటీ నివేదిక తమకు వ్యతిరేకంగా వుందంటూ తెలంగాణలో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నేపథ్యంలో, రెండ్రోజులు పాటు బంద్ కి ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన సంగతి విదితమే. ప్రస్తుతానికి పరిస్థితులు ప్రశాంతంగానే వున్నా, రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండడం, ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు బంద్ లకు పిలుపునితస్తుండడంతో సంక్రాంతి పై ఎన్నో ఆశలు పెట్టుకున్న టాలీవుడ్ లో కంగారు బయల్థేరింది.
ఇంకో ఏడెనిమిది రోజుల్లో వరుసగా భారీ సినిమాలు విడుదలవుతున్న దరిమిలా, ఉద్యమ సెగలు సినిమాలకు తాకితే, టాలీవుడ్ భారీగా నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందని ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు. 'పరమవీర చక్ర", 'మిరపకాయ" తదితర భారీ చిత్రాలు ఈ క్రాంతికి విడుదల కానుండగా, వీటిల్లో 'పరమవీర చక్ర" సినిమాకి తెలంగాణ సెగ గట్టిగానే తగిలే అవకాశాలు సుస్పష్టం. అయితే, రెండు మూడు రోజుల్లో పరిస్థితి చల్లారుతుందనీ, సంక్రాంతి సినిమాలకు ఉద్యమాల సెగ పెద్దగా వుండదనే వారు లేకపోలేదు. మరి చూద్దాం టాలీవుడ్ కి ఈ సంక్రాంతి కలిసొస్తుందో..?లేక తేడా వస్తుందో వేచి చూడాల్సిందే....?


Click it and Unblock the Notifications











