2022 Upcoming movies: ఈ ఏడాది సినీ లవర్స్ కు పండగే.. ఏ సినిమా ఎప్పుడు రాబోతోందంటే?

రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా విడుదల తేదీలపై కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ కూడా కొన్ని సినిమాలు అయితే అనుకున్న సమయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది చివరి వరకు చూసుకుంటే వివిధ రకాల సినిమాలతో సునీల్ అవర్స్ కు ఒక మంచి కిక్ అందబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక ఏ సినిమా ఎప్పుడు రాబోతోంది రిలీజ్ డేట్స్ వివరాల్లోకి వెళితే..

ధనుష్, PS 1

ధనుష్, PS 1

సెప్టెంబర్ 29వ తేదీన ధనుష్ నటించిన నేనే వస్తున్నా అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు కాని రిజల్ట్ తర్వాత హైప్ పెరుగుతుంది అని తెలుగులో భారీగానే విడుదల చేయబోతున్నారు. ఇక మణిరత్నం ఫ్యాన్ ఇండియా సినిమా పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30వ తేదీన రాబోతోంది.

దసరా ఫెస్టివల్

దసరా ఫెస్టివల్

ఇక అక్టోబర్ లో అయితే సినిమాల సందడి మాములుగా లేదు అని చెప్పవచ్చు. కేవలం అక్టోబర్ నెలలోనే మొత్తం 11 సినిమాలు రాబోతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ఫిక్స్ కావాల్సి ఉంది. ఇక అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన రానుండిక్. ఇక అదే రోజు నాగర్జున ఘోస్ట్ సినిమాతో పాటు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం మంచు విష్ణు జిన్నా విడుదల కానుంది.

ఓరి దేవుడా..

ఓరి దేవుడా..

ఇక అక్టోబర్లో విడుదల కాబోతున్న మరికొన్ని సినిమాల వివరాల్లోకి వెళితే బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సినిమా తో పాటు క్రేజీ ఫెలో కూడా అక్టోబర్ 14వ తేదీన రాబోతోంది. ఇక తర్వాత విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా అనే సినిమా అక్టోబర్ 21వ తేదీన రాబోతోంది. అదే రోజు బ్లాక్ ఆడమ్, అలాగే రవితేజ ధమాకా సినిమా రానుంది. ఇక జాతి రత్నాలు డైరెక్టర్ ప్రిన్స్ కూడా అదే రోజూ విడుదల కాబోతోంది.

 మరికొన్ని సినిమాలు

మరికొన్ని సినిమాలు

ఇక సమంత నటించిన శకుంతలం సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రాబోతోంది. ఇక అల్లు శిరీష్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా కూడా నవంబర్ 4న రాబోతోంది. ఇక అడవి శేష్ హిట్ 2 సినిమాతో పాటు ధనుష్ సార్ సినిమా కూడా డిసెంబర్ 2న ఒకేరోజు రాబోతున్నాయి.

అవతార్ 2, ఖుషి

అవతార్ 2, ఖుషి

ఇక నందమూరి కళ్యాణ్ రామ్ 19వ సినిమా కూడా డిసెంబర్ 2న రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్న అవతార్ 2 కూడా డిసెంబర్ 16న రాబోతోంది. ఇక విజయ్ దేవరకొండ - సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఖుషి సినిమా అక్టోబర్ 23 వస్తోంది. చివరగా రుద్రుడు అనే సినిమా అదే రోజు రానుంది. ఇక ఈ లిస్ట్ లో మరికొన్ని సినిమాలు కూడా త్వరలోనే చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X