తెలుగు సినిమా పరిశ్రమ ఆ రెండు రోజులు బంద్

ఆ రెండు రోజులు తెలుగు సినిమాలకు సంబంధించి ఎలాంటి షూటింగులు జరుపురాదని, పూర్తిగా ఆ రెండు రోజులు సెలవు ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించారు. అదే సమయంలో థియేటర్లలో కూడా ఉదయం, మధ్యాహ్నం షోలు రద్దు చేయాలని, ఓటింగు ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటల నుండి మళ్లీ షోలు ప్రారంభించాలని నిర్ణయించారు.
సాధారణంగా సినిమా పరిశ్రమలో పని చేసే వారు షూటింగుల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పని చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతాల్లో ఉంటే ఓటు వేయడం కుదరదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగే ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో ఎన్నికలు జరిగే మే 7వ తేదీన సెలవు ప్రకటించారు.
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని, దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరో వైపు ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది. పలువురు సినిమా తారలు కూడా ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటర్లలో చైనత్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications