టాలీవుడ్ లో మళ్ళీ కలకలం.. ఆ పని చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్..వారందరిలో గుబులు?

టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం వదిలేట్టు కనిపించడం లేదు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు కొందరు విచారణ కూడా ఎదుర్కొని ఇబ్బందులు పడిన క్రమంలో ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ కావడం సంచలనం గా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సరైన క్లారిటీ లేదు

సరైన క్లారిటీ లేదు


టాలీవుడ్ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం పట్టి కుదిపేసిన సంగతి తెలిసిందే. సినీ హీరో రవితేజ సోదరుడు కారు ప్రమాదంలో మరణించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. అప్పట్లో చాలా మంది సినీ ప్రముఖులను తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారణకు హాజరు కమ్మని కోరడమే కాక వారి శాంపిల్స్ కూడా తీసుకొని పరీక్షలకు పంపింది. అయితే వాళ్ళు డ్రగ్స్ వాడుతున్న ఆనవాళ్లు లేవని చెప్పిందని కొన్నిసార్లు చెప్పలేదని కొన్నిసార్లు మీడియాలో ప్రచారం జరిగింది కానీ అసలు ఆ విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇప్పటికి కూడా లేదు.

కరెక్ట్ కాదు అంటూ

కరెక్ట్ కాదు అంటూ

ఇటీవల ఒక పబ్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారిక వంటివారు దొరకడం కూడా సంచలనం రేపింది. ఎందుకంటే అదే పబ్ లో డ్రగ్స్ వాడుతున్న ఆనవాళ్లు పోలీసులకు దొరికాయి. రాహుల్ సిప్లిగంజ్ కానీ నిహారిక గాని డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదు కానీ ఆ పార్టీకి హాజరైన వారంతా డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత సినీ పరిశ్రమ నుంచి కొంతమంది అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటూ ఖండించడంతో అక్కడితో కాస్త ఈ వార్తలకు బ్రేకులు పడ్డాయి.

సైడ్ బిజినెస్ గా

సైడ్ బిజినెస్ గా

అయితే ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా చిన్న మొత్తం అనుకుంటే పొరపాటే ఏకంగా 190 కేజీల గంజాయితో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న హాథీరాం అనే వ్యక్తి పట్టుబడ్డాడు. యుద్ధం శరణం, కురుక్షేత్రం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన హాథీరాంకు సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

సైడ్ బిజినెస్ గా

సైడ్ బిజినెస్ గా


టాలీవుడ్ లో డ్రగ్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ గంజాయిని వాడుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినీ ప్రముఖుల సంగతి పక్కన పెడితే కొంత మంది సినీ ఆర్టిస్టులకు తాను గంజాయి సప్లై చేస్తున్నట్లు హాథీరాం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీంతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పక్క సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకు పని చేస్తూనే మరో పక్క సైడ్ బిజినెస్ గా ఈ గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నట్లు గుర్తించారు.

Recommended Video

KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
టాలీవుడ్ లో సంచలనం

టాలీవుడ్ లో సంచలనం

ప్రస్తుతానికి కర్ణాటక నుంచి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు కానీ అసలు వీరికి ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారు? ఎవరెవరికి వీరు సప్లై చేస్తున్నారు అనే విషయం మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏకంగా 190 కేజీల గంజాయి పట్టుబడింది అని తెలియడంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అతని వద్ద నుంచి కొనుగోలు చేసినట్టు భావిస్తున్న సినీ ఆర్టిస్ట్ లలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X