»   » చైతు-సమంత పెళ్లి సందడి: ఈ విషయం తెలిస్తే కళ్లు తిరుగుతాయి!

చైతు-సమంత పెళ్లి సందడి: ఈ విషయం తెలిస్తే కళ్లు తిరుగుతాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Naga chaitanya-Samantha Wedding Highlights చైతు-సమంత పెళ్లిలో

దసరా పండగ ముగిసింది. తెలుగు సినిమా ప్రియులంతా సెలవుల్లో దసరా రిలీజ్ సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఇపుడు అందరి దృష్టి నాగ చైతన్య-సమంత పెళ్లి వైపు మళ్లింది. అక్టోబర్ 6వ తేదీన సమంత, నాగ చైనత్య వివాహం జరుగబోతున్న సంగతి తెలిసిందే.

నాగ చైతన్య-సమంత వివాహం గోవాలో జరుగుతోంది. ఈ నెల 6,7న నాగచైతన్య, సమంతల వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయపద్దతుల్లో భార్యా భర్తలు కాబోతున్నారు. ఈ కల్యాణ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరగనుందని నాగార్జున తెలిపారు.

వివాహ వేదిక

వివాహ వేదిక

గోవాలోని ‘డబ్ల్యు' అనే ఖరదీదైన స్టార్ హోటల్ చై-సామ్ వివాహానికి వేదిక కాబోతోంది. ఈ వివాహ వేడుకకు దాదాపు 200 మంది గెస్టులు హాజరు కాబోతున్నారు. వీరి కోసం హోటల్ లోని రూమ్స్ అన్నీ దాదాపుగా బుక్ చేసేశారట.

కళ్లు తిరగాల్సిందే...

కళ్లు తిరగాల్సిందే...

‘డబ్బ్య' హోటల్ లో రూమ్స్ రెంటు విషయం తెలిస్తే సామాన్యుల కళ్లు తిరగాల్సిందే. ఈ హోటల్ లో ఒక్కోరూమ్ ప్రారంభ రోజుకు ధర రూ. 16 వేల రూపాయలు. కాస్లీ సూట్ ఖరీదు రోజుకు రూ. 75 వేల రూపాయలు.

బంధువులంతా ఇక్కడే...

బంధువులంతా ఇక్కడే...

చైతన్య, సమంత బంధువులందరికీ ‘డబ్ల్యూ' హోటల్ లోనే రూమ్స్ బుక్ చేశారట. అయితే కొందరు స్నేహితులకు మాత్రం దగ్గర్లోని మరో హోటల్ లో విడిది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఖరీదైన వెడ్డింగ్

ఖరీదైన వెడ్డింగ్

చైతు, సమంత వెడ్డింగ్ టాలీవుడ్లో అత్యంత ఖరీదైన వెడ్డింగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. పెళ్లి వేడుకలో డెకరేట్ చేయడానికి విదేశాల నుండి ప్రత్యేకంగా ఫ్లవర్స్ తెప్పించినట్లు సమాచారం.

రిసెప్షన్

రిసెప్షన్

రిసెప్షన్ గురించి అడిగితే నాగ చైతన్య వద్దని చెప్పాడని, దీంతో దాని గురించి నువ్వు ఆలోచించవద్దని, నేను చూసుకుంటానని చైకి చెప్పానని నాగార్జున తెలిపారు. చై రిసెప్షన్ హైదరాబాదులోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ లో ఈ నెల 15న జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు అందర్నీ ఆహ్వానిస్తానని నాగార్జున తెలిపారు.

English summary
Tollywood attention has been diverted to Akkineni Naga Chaitanya-Samantha wedding now. The wedding of the T-town celebrity couple is widely discussed in the social media now. It is known that Tollywood's cute couple has planned their wedding at Goa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu