twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    24, బిచ్చగాడు సినిమాల కలెక్షన్స్ వైరల్.. ఈ లెక్కలతో వాళ్ళకు కౌంటర్!

    |

    ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా మన సినిమాలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. అయితే కొంతమంది తమిళ ప్రేక్షకులు వ్యత్యాసాలు చూపుతూ టాలీవుడ్ హీరోల హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ అలాగే మహేష్ ఫ్యాన్స్ కు సంబంధించిన ట్వీట్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    దీంతో ఓ వర్గం అభిమానులు ప్రతిదాడి చేయకుండా ప్రేమతో ఉదాహరణలు ఇస్తున్నారు. మొదట తమిళ సినిమాలకు తెలుగు ఆడియేన్స్ సపోర్ట్ చేశారని అక్కడి హీరోలను ఎలాంటి భేదం లేకుండా అభిమానిస్తారని బాక్సాఫీస్ కలెక్షన్స్ తో సమాధానం ఇస్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తమిళనాడులో 26 కోట్లు కలెక్ట్ చేయగా తెలుగులో కూడా అదే తరహాలో 25 కోట్లు వసూలు చేయడం ఆశ్చర్యకరం.

    Tollywood audience love More than with kollywood audience

    ఇక తెలుగులో ఎప్పటి నుంచో మంచి మార్కెట్ ఉన్న సూర్య ప్రతీ సినిమా కూడా ఇక్కడ కొన్నేళ్ల వరకు స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక 24 సినిమా తమిళనాడులో 30 కోట్లు రాబట్టింది. అదే తరహాలో తెలుగులో కూడా 30 కోట్లు రాబట్టి మంచి లాభాలను అందించింది. ఈ విధంగా తమిళ హీరోలను తెలుగు వారు పోటీ పడుతూ లవ్ చేస్తున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ సినిమాలకు కూడా తెలుగులో అయితే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక కార్తీ తమిళంలో కంటే మొదట తెలుగులోనే సక్సెస్ అందుకున్నాడు. అతను నటించిన యుగానికి ఒక్కడు సినిమా తమిళనాడులో ఫ్లాప్ అయ్యింది. కాని తెలుగులో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆ తర్వాత అవారా, నా పేరు శివ ఇలా వరుస విజయాలు అందుకున్నాడు.

    English summary
    Tollywood audience love More than with kollywood audience
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X