twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ బంద్: ‘బాహుబలి’ మాత్రం నో బంద్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 24 శాఖల కార్మికులు తమ వేతనాలు పెంచాలని సోమవారం నుండి బంద్ కొనసాగిస్తున్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు 15 రోజులపాటు టాలీవుడ్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగులు నిలిచిపోయాయి.

    అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం మాత్రం నిరాటకంగా కొనసాగుతోంది. రాజమౌళి చిత్రంలో పని చేస్తున్న నిపుణుల్లో ఎక్కువ మంది విదేశాలకు చెందిన వారు కావడంతో షూటింగ్ కు ఆటంకం ఏర్పడటం లేదని తెలుస్తోంది. డిసెంబర్ వరకు సినిమాను పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముక్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

    Tollywood Bandh: Workers are demanding a revision of wages

    బంద్ విషయానికొస్తే...
    తమతమ వేతనాలు పెంచాలని కోరుతూ నిర్మాతల మండలితో కొద్దిరోజులుగా సినీ కార్మికులు చర్చలు జరుగుతున్నారు. వేతనాల పెంపు విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో మంగళవారం నుంచి పదిహేనురోజులపాటు షూటింగ్‌లకు దూరంగా వుండాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో మాత్రం షూటింగులు నిలిచి పోయాయి. విదేశాలు, మిగతా రాష్ర్టాల్లో కంటిన్యూ అవుతున్నాయి.

    English summary
    Almost all the workers of 24 crafts in the Telugu film industry participate in the bandh. Workers are demanding a revision of wages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X