For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ 2019 : శ్రోతలను అలరించిన పాటలు ఇవే.. ఫస్టాఫ్‌లో దేవీ, సెకండాఫ్‌లో తమన్

  |

  ఈ ఏడాదిలో ఎన్నో పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ప్రతీ సంగీత దర్శకుడు తనలోని ప్రతిభను చూపిస్తూ.. అందించిన పాటలు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. ఈ ఏడాదిలో ఎన్నో పాటలు సినీ అభిమానుల మనసును దోచుకున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా తమన్ అందించిన పాటలు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ పాటలపై ఓ లుక్కేద్దాం.

  దేవీ చేసిన మ్యాజిక్..

  దేవీ చేసిన మ్యాజిక్..

  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లోనే ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రేమికులు సమయాన్ని మరిచిపోయే పాడుకునే పాటైనా.. ఐటెమ్ సాంగ్ కోరుకునే మాస్ జనాలైనా అది దేవీ అందించాల్సిందే. ఈ ఏడాదిలోనూ అలాంటి ఫీల్ గుడ్, ఊపునిచ్చే మాస్ బీట్స్‌ను అందించాడు. వినయ విధేయ రామ చిత్రంతో బోణి కొట్టిన దేవీ.. మంచి ఫలితాన్నే అందుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా.. మ్యూజిక్ మాత్రం హిట్టైంది. మొత్తంగా ఈ ఏడాది ఎఫ్2, మహర్షి, చిత్రలహరి వంటి సినిమాలు సక్సెస్ కావడంతో దేవీ తన వంతు సాయం చేశాడు.

  అలరించిన దేవీ పాటలు ఇవే..

  అలరించిన దేవీ పాటలు ఇవే..

  వినయ విదేయ రామ చిత్రం నుంచి తందానే తందానే అనే ఫ్యామిలీ సాంగ్, ఏక్ బార్ ఏక్ బార్ అనే మాస్ బీట్ అదిరిపోయాయి. ఎఫ్2 నుంచి ఎంతో ఫన్, గిర్రా గిర్రా, రెచ్చిపోదాం అనే పాటలు ఓ ఊపు ఊపాయి. మహర్షి చిత్రం నుంచి ఇదే కదా ఇదే కదా, పదర పదర, చోటి చోటి బాతే అనే పాటలు ఎంతగానో వైరల్ అయ్యాయి. చిత్ర లహరి నుంచి ప్రేమ వెన్నెల అనే పాట యూత్‌ను తెగ ఆకట్టుకుంది.

  దూసుకుపోతోన్న తమన్..

  దూసుకుపోతోన్న తమన్..

  తమన్ ఈ ఏడాది ప్రథమార్థంలో ఎలాంటి సందడి చేయకపోయినా.. సెకండాఫ్‌లో మాత్రం కుమ్మేస్తున్నాడు. వరుస చిత్రాలు, వరుస హిట్ పాటలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు. వంద మిలియన్లు, మిలియన్ల లైకులు ఇలా కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఈ జోరు చూస్తుంటే తమన్‌ను ఆపడం ఎవరి తరం కాదేమోననిపిస్తోంది.

   మ్యూజికల్ సెన్సేషన్‌గా మారిన తమన్..

  మ్యూజికల్ సెన్సేషన్‌గా మారిన తమన్..

  అలవైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన, రాములో రాముల, ఓఎమ్‌జీ డ్యాడీ అనే పాటలు యూట్యూబ్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సామజవరగమన ఫీవర్ ఎలా పట్టుకుందో టిక్ టాక్ ప్రపంచానికి తెలుసు. ఇవే కాక వెంకీమామ, ప్రతిరోజు పండగే చిత్రాలతోనూ మంచి పాటలు అందించాడు. వచ్చే ఏడాదిలోనూ క్షణం తీరిక లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్కో రాజా, మిస్ ఇండియా, సోలో బతుకే సో బెటర్, క్రాక్, టక్ జగదీశ్ లాంటి సినిమాలకు సంగీతం అందించనున్నాడు.

  మెస్మరైజ్ చేసిన అనిరుధ్..

  మెస్మరైజ్ చేసిన అనిరుధ్..

  తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. దళపతి విజయ్, సూపర్ స్టార్ రజినీ కాంత్ లాంటి స్టార్ హీరోలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉంటాడు. తమిళ నాట ఈ యువ సంగీత దర్శకుడి పాటలే మార్మోగిపోతాయి. మాస్ బీట్సే కాకుండా రొమాంటిక్ బీట్స్ కూడా అంతేస్థాయిలో ఇవ్వడం ఇతడి ప్రత్యేకత. ఈ ఏడాదిలోనూ మంచి మెలోడిస్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు.

  జెర్సీ, గ్యాంగ్‌లీడర్ చిత్రాలతో..

  జెర్సీ, గ్యాంగ్‌లీడర్ చిత్రాలతో..

  నాని నటించిన జెర్సీ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఎంతగా ప్లస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జెర్సీ చిత్రంలోని అదేంటో గానీ ఉన్నపాటుగా, పదే పదే, ప్రపంచమే అలా అనే పాటలు ఫుల్ ఫేమస్ అయ్యాయి. గ్యాంగ్ లీడర్ చిత్రానికి వచ్చే సరికి టైటిల్ సాంగ్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. హొయినా హొయినా అనే పాట యూత్‌కు బాగా కనెక్ట్ అయింది.

  ఆకట్టుకున్న గోపీ, మిక్కీ, విశాల్

  ఆకట్టుకున్న గోపీ, మిక్కీ, విశాల్

  గీతగోవిందంతో సంచలనం సృష్టించిన గోపీ సుందర్ ఈ ఏడాది మజిలీ చిత్రంలో ఎందరినో తన మాయలో పడేసుకున్నాడు. ప్రియతమా ప్రియతమా అనే పాట ప్రతీ జంట పాడుకునే ఉంటుంది. మిక్కీ జే మేయర్ అందించిన ఓ బేబీ, గద్దల కొండ గణేష్ పాటలు ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఫీల్ గుడ్ పాటలే కాకుండా.. మాస్ బీట్స్‌తోనూ మిక్కీ ఆకట్టుకున్నాడు. ఇక విశాల్ చంద్ర శేఖర్ నుంచి వచ్చిన ఏమై పోయావే, పడి పడి లేచే మనసు పాటలు ప్రేమపక్షులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

  English summary
  Tollywood Best Albums And Most Viral Songs 2019. Devi Sri Prasad, S Thaman, Mickey J Meyer, Anirudh Ravichander, Vishal Chandrashekar, Gopi Sundar Albums Rocked This year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X