ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల భేటి.. టాలీవుడ్ ఎజెండా ఇదే..

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఏపీ రాజధాని అమరావతికి మంగళవారం మధ్యాహ్నం చేరుకొన్నారు. ఏపీ సీఎంను కలుసుకొనేందుకు వెళ్లిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్ తదితరులు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులకు అధికారులు స్వాగతం ఆహ్వానం పలికారు. దాదాపు 25 మంది వెళ్లాల్సి ఉండగా కరోనా కారణంగా కొందరినే భేటికి రావాలని అధికారులు సూచించారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Tollywood Stars Chiranjeevi & Others Met AP CM YS Jagan Over TFI Isuues
నంది అవార్డులు తదితర అంశాలు

నంది అవార్డులు తదితర అంశాలు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలువాలని సినీ ప్రముఖులు బృందం కొద్దిరోజుల క్రితం నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. నంది అవార్డులు, సినిమా పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, నిర్మాతలకు, సినీ ప్రముఖులకు అందించాల్సిన అంశాలను ప్రధానంగా ఎజెండాగా మలుచుకొన్నట్టు సమాచారం.

షూటింగులకు ప్రోత్సాహకాల కోసం

షూటింగులకు ప్రోత్సాహకాల కోసం

ఇక కరోనా పరిస్థితుల కారణంగా మూసి వేసిన థియేటర్లను ప్రారంభించడం, అలాగే సినిమా షూటింగులను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించాలని కోరనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితుల్లో కుదేలైన సినీ పరిశ్రమను ఆదుకోవాలని సీఎంను కోరనున్నట్టు ప్రముఖుల బృందం వెల్లడించింది.

ఓ వర్గం అసంతృప్తితో

ఓ వర్గం అసంతృప్తితో

ఇక ఏపీ సీఎంతో భేటీ కావడంపై సినీ పరిశ్రమలో ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కరోనా పరిస్థితులు ఉంటే సినిమా అభివృద్ధి కోసం చర్చలు జరపడం ఏమిటి? కేవలం తమ సినిమాల షూటింగులు పూర్తి చేసుకొనేందుకు కొందరు ఆరాట పడుతున్నారనే ఓ వర్గం ఆరోపణలు గుప్పిస్తున్నది.

మర్యాద పూర్వకంగా సీఎంను కలిసి

మర్యాద పూర్వకంగా సీఎంను కలిసి

ఇదిలా ఉండగా, ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సినీ ప్రముఖులెవరూ కలిసిన దాఖలాలు లేవు. అప్పట్లో ఈ విషయంపై పలువురు తీవ్రంగా స్పందించారు. తెలుగు రాష్ట్రంలో సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోరా అనే విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా పరిస్థితుల కారణంగా ఏపీ సీఎంను తప్పనిసరిగా కలువాల్సిన పరిస్థితి తలెత్తింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X