twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలు,క్రైమ్స్:రోజా,జయసుధ

    By Staff
    |

    Roja
    ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం(2008) మహిళలలపై ఫధ్నాలుగు దాకా వైలెంట్ ఎటాక్స్ జరగాయి. ఇలా జరగటానికి గల కారణాలలో సినిమా ప్రధానాంశమని మహిళా సంఘాలు మొత్తుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ అంశంపై వివిధ సినీ ప్రముఖుల స్పందన ఇలా ఉంది.

    నీ నటి నుండి నుండి రాజకీయల్లోకి టర్న్ అయిన జయసుధ మాట్లాడుతూ...రిలీజయ్యే పది తెలుగు సినిమాల్లో తొమ్మిది ప్రేమ చుట్టూ తిరిగే కథలే. అవి కూడా ప్రేమే జీవిత లక్ష్యం అంటూ చూపి యువతను తప్పు దారి పట్టిస్తున్నాయి. దాంతో అదే హీరోయిజం అనుకుని ప్రభావిత యువత బయిట కూడా అట్లానే బిహేవ్ చేస్తున్నారు.అయినా తెలుగు సినిమాల్లో ఈవ్ టీజింగ్ ని ఫన్ కోసం ఉపయోగిస్తున్నారు. తను ఇష్టపడ్డ అమ్మాయిని హీరో దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది వస్తోంది.ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయటం,వెనుకపడి అల్లరిచేయటం,చచ్చిపోతానంటూ బెదిరించి ప్రేమను ఓకె చేయించుకోవటం జరుగుతోంది.అదేంటో గాని ఇంట్లో వాళ్ళు సైతం హీరోని ఆ అమ్మాయినే తెచ్చి పెళ్ళి చేసుకోరా అని ఉద్భోదిస్తూంటారు.ప్రెండ్స్ ని అట్లానే చూపుతారు.

    ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సినిమాలో సోషల్ రెస్పన్స్ బులిటి ఉండాలన్నదానికి స్పందిస్తూ...క్రైమ్ అనేది మానవ సహజం.అది సినిమాలు పుట్టకముందు నుంచి ఉంది. అలాగే ఇలా సినిమాలు తీయాలి ఇలాంటి కంటెంటు ఉండాలి...అలాంటి సీన్స్ ఉండకూడదు..అని నిర్ధిసిస్తే కష్టం.నిర్మాత,దర్శకలు వాళ్ళంతట వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సిన సున్నిత విషయాలు ఇవి. మంచి సినిమా అంటే ప్యామిలీ మొత్తం వెళ్ళి చూసేది అని..

    మాజీ నటి,రాజకీయనాయకురాలు రోజా మాట్లాడుతూ.. సినిమాల్లో అసహజత్వం పెరిగిపోతోంది.నిజజీవితంలో ఎప్పుడూ జరగనివే సినిమాల్లో చూపెడుతున్నారు.ఎక్కడయినా ఏ తల్లి తండ్రులయినా తమ పిల్లలను వెళ్ళి ప్రేమించిన అమ్మాయిని వెళ్లి తెచ్చుకోమంటూ చెపుతారా ...సినిమాల్లోనే అలా జరుగుతుంది అయినా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే ఈ సినిమా మీడియాకి తప్పనిసరిగా సోషల్ రెస్పాన్స్ బులిటీ ఉండాల్సిందే అన్నారు.

    ఎపి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తమ్మారెడ్డి భరధ్వాజ ఈ టాపిక్ పై మాట్లాడుతూ..సినిమాలు,మీడియా రెండూ సోషల్ రెస్పన్స్ బులిటీ తో పనిచేయాల్సిందే. ఇక ఇలాంటి విషయాలపై చట్టాలు చేయటం అనవసరం. ప్రేక్షకులే అలాంటి సినిమాలు చూడటం మానేయాలి. అప్పుడే పరిస్దితులు మారుతాయి.

    దర్శకురాలుగా మారిన జీవితా రాజశేఖర్ ఈ విషయంపై మాట్లాడుతూ..సినిమాలను ఒక్కటే సమాజాన్ని పాడు చేస్తున్నాయని అనుకోవాల్సిన పనిలేదు. టీవీ సీరియల్స్ సైతం అలాగే ఉన్నాయి. అవి కూడా సెన్సార్ చేయాలి. క్రైమ్,సెక్స్,వయిలెన్స్ టీవీల్లో విపరీతంగా చూపెడుతున్నారు. ఎవరూ దాన్ని రెగ్యులేట్ చేయటం లేదు.గవర్నమెంట్ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X