2012: టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఇవే
2012 పెద్ద పెద్ద సినిమాలకు వేదిక కానుంది. ఇప్పటివరకూ ప్రారంభించబడిన చిత్రాలును చూస్తే సంక్రాంతికి బిజినెస్ మ్యాన్, నిప్పు, బాడీగార్డ్ సినిమాలు విడుదల అవుతన్నాయి. ఈ చిత్రం అనంతరం సునీల్ పూలరంగడు చిత్రం రిలీజ్ అవుతుంది. ఇవి కాకుండా ఈ సంవత్సరలో రామ్ చరణ్ రచ్చ చిత్రం, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రాజమౌళి ఈగ, నాగార్జున ఢమురకం, మహేష్ సీతమ్మ వాకిట్లో సిరి మల్లే చెట్టు, ఎన్టీఆర్ దమ్ము చిత్రాలు తమ సత్తా చూపటానికి ప్రిపేర్ అవుతన్నాయి. వీటితో పాటు ప్రభాస్ రెబెల్ చిత్రం, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్నాయి.
వీరితో పాటు నాగచైతన్య.. ఆటో నగర్ సూర్య చిత్రం కూడా ఈ సంవత్సరంలో అలరించటానికి రెడీ అవుతోంది. వీటి మధ్యలో శివరాత్రికి బాలకృష్ణ ..అధినాయకుడు చిత్రం వచ్చి పోటీ ఇవ్వబోతోంది. మరో ప్రక్క దగ్గుపాటి రాణా కూడా డిపార్టమెంట్, కృష్ణం వందే జగద్గురం చిత్రాలతో రంగంలోకి దూకుతున్నాడు. మరి 2012 ఎవరికి పెద్ద హిట్ ఇచ్చి టాప్ ఛెయిర్ లో కూర్చో బెడుతుంది.. ఏ నిర్మాతని లాభాల బాటలో నడిపిస్తుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











