డౌటే లేదు.. రాంచరణ్ చంపేస్తాడు.. జూనియర్ ఖైదీ సరికొత్తగా!
Recommended Video

వినయ విధేయ రామ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాంచరణ్, బోయపాటి, ఇతర చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. రంగస్థలం చిత్రం తర్వాత రాంచరణ్ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భరత్ అనే నేను చిత్రం తర్వాత కైరా అద్వానీ నటించిన రెండవ తెలుగు చిత్రం ఇది. డివివి దానయ్య నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. మంచు మనోజ్, దర్శకుడు బాబీ, ఇంకా కొంతమంది సెలెబ్రిటీలు వినయ విధేయ రామ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎలాంటి సందేహం లేదు
సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టీమ్ వినయ్ విధేయ రామకు శుభాకాంక్షలు. నా స్నేహితుడు రాంచరణ్, బోయపాటిగారు కలసి చంపేసి ఉంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సంక్రాంతికి వరుసగా క్రేజీ చిత్రాలు విద్దులవుతున్నాయి. ఎంజాయ్ చేయండి డార్లింగ్స్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
రాంచరణ్ సరికొత్తగా
మంచి కాంబినేషన్ లో వచ్చే చిత్రాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రమే వినయ విధేయ రామ. బోయపాటిగారి స్టైల్ లో సరికొత్త రాంచరణ్ ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన దేవిశ్రీ అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ అయింది. డివివి దానయ్య గారికి, వినయ విధేయ రామ చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని దర్శకుడు బోయపాటి ట్వీట్ చేశారు.
జూనియర్ ఖైదీ
ఇక సాయిధరమ్ తేజ్ కూడా వినయ విధేయ రామ చిత్ర యూనిట్ కి తన విషెష్ తెలియజేశాడు. రాంచరణ్ ని జూనియర్ ఖైదీగా అభివర్ణించాడు. జూనియర్ ఖైదీకి, వినయ విధేయ రామ చిత్ర యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నా. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.
అనిల్ రావిపూడి
దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. రాంచరణ్, బోయపాటికి, ఇతర చిత్ర యూనిట్ మొత్తానికి వినయ విధేయ రామ విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు అని తెలిపారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో చివరగా విడుదలవుతున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











