»   » ‘మన మద్రాస్ కోసం’: టాలీవుడ్ సెలబ్రిటీల విరాళాల సేకరణ

‘మన మద్రాస్ కోసం’: టాలీవుడ్ సెలబ్రిటీల విరాళాల సేకరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చెన్నై వరద బాదితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కొందరు డబ్బు రూపంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించగా....మరికొందరు ప్రస్తుతం వారికి అవసరం అయిన ఆహారం, మెడికల్ సప్లిస్, తాగునీరు, ఇతర వస్తువులు అందించేందుకు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా రానా, మంచు లక్ష్మి, అల్లరి నరేష్, అఖిల్, నవదీప్,సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్, నిఖిల్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, మధు శాలిని, తేజస్వి మరికొందరు టాలీవుడ్ స్టార్లు ఆదివారం ‘మన మద్రాస్ కోసం’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి విరాళాలు, సహాయ సామాగ్రిని సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మంజీరా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, కూకట్ పల్లిలోని ఫోరమ్ సంజానా మాల్ లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పలువురు సెలబ్రిటీలు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నారు.

Tollywood celebrities to collects donations from people

దీనిపై రాజమౌళి స్పందిస్తూ...‘వందేళ్ల కాలంలో ఎన్నడూ చూడని భారీ వరదలను చెన్నై ఎదుర్కొంటోంది. వీటి కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలవ్వడం బాధాకరం. మా టీం వారికి కావాల్సిన సరుకులను పంపుతోంది. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనవి పంపాలి' అని కోరారు.

అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం..... ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు విరాళంగా ఇవ్వడం కంటే... వారికి కావాల్సిన ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ అందించడం ఎంతో అవసరం. నిల్వ ఉండే ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ లాంటివి అందించే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఇతర వస్తువులు ఏమైనా పంపాలనుకుంటే రామానాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్, జూబ్లిహిల్స్, హైదరాబాద్ అడ్రస్ కు పంపండి. తప్పకుండా వీటిని నేరుగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండే బాధితులకు మేము అందజేస్తాం' అని రాజమౌళి ఫేస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

దయచేసి ఎవరూ వాడిన దుస్తువులు మాత్రం పంపొద్దు. గతానుభవంతో చెబుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అక్కడి వారికి బాగా ఉపయోగ పడుతుందని బావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న రానాకు థాంక్స్ అని రాజమౌళి పేర్కొన్నారు.

English summary
Tollywood celebrities Rana, Manchu Lakshmi and other stars to collects donations from people on sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu