67th National Film awards: సత్తా చాటిన జెర్సీ, మహర్షి.. గర్వంగా ఉందంటూ వెంకీ, మంచు లక్ష్మి, నాని కామెంట్స్
67వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమాలు మరోసారి సత్తా చూపించాయి. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ సభ్యులు ప్రకటించిన అవార్డులలో మంచి కంటెంట్ ఉన్న సందేశాత్మక సినిమాలకు ఎక్కువగా గుర్తింపు దక్కింది. ఉత్తమ చిత్రాలకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పట్టం కట్టే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో సినిమాల్లోని నటీనటులు అలాగే ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకటేష్ వంటి అగ్ర నటులు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.

వెంకీ పాజిటివ్ కామెంట్స్
ముందుగా ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ విజేతలకు తన బెస్ట్ విషెస్ అందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా అలాగే బెస్ట్ ఎడిటింగ్ క్యాటగిరిలో నాని 'జెర్సీ'కి రెండు అవార్డులను ప్రకటించారు. వెల్ డాన్ అంటూ.. వెంకటేష్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అసురన్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా నిలిచిన ధనుష్ కు కూడా వెంకటేష్ విషెస్ అందించారు. సినిమాలో శివస్వామి పాత్రలో అద్భుతంగా నటించారని ఈ అవార్డుకు మీరు అర్హులే అంటూ ట్వీట్ చేశారు. అలాగే మహేష్ బాబు మహర్షి సినిమా అత్యదిక ప్రజాదరణ పొందిన సినిమాల్లో నిలువగా చిత్ర యూనిట్ సభ్యులందరికి తన విషెస్ అందించారు.

రాజ్ కందుకూరి విషెస్
ఇక నిర్మాత రాజ్ కందుకూరి కూడా విన్నర్స్ శుభాకాంక్షలు తెలిపారు. జెర్సీ మూవీకి అలాగే మహర్షి సినిమాకు పని చేసిన టీమ్ సబ్యులకు కంగ్రాట్స్ అంటూ నవీన్ నూలి, రాజు సుందరం మాస్టర్ లకు బెస్ట్ విషెస్ అందించారు. మహేష్ బాబుకు, నానికి అలాగే నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

చాలా గొప్ప సినిమా
మంచు లక్ష్మి కూడా జెర్సీ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. నానికి అలాగే టీమ్ సభ్యులందరికి విషెస్ అందిస్తూ నిజంగా చాలా గొప్ప సినిమా అన్నట్లుగా ట్వీట్ చేశారు. ఇక జెర్సీ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ గౌతమ్ జీనియస్ అని కామెంట్ చేశారు. అలాగే చాలా గర్వంగా ఉందని కూడా అన్నారు. శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

నాని ఎమోషనల్ ఫొటో
ఇక హీరో నాని కూడా ఎమోషన్ ఫొటో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. జెర్సీ సినిమాలో ట్రైన్ సౌండ్ లో ఎంతగానో ఎమోషనల్ అయ్యే సీన్ గురించి అందరికి తెలిసిందే. ఆ సీన్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నాని ఆ ఫొటో పోస్ట్ చేసి నమస్కారం అని ట్వీట్ చేశాడు.

గర్వాంగా ఉంది..
జై లవకుశ దర్శకుడు బాబీ కూడా రెండు తెలుగు సినిమాల యూనిట్ సబ్యులకు స్పెషల్ గా విషెస్ అందించారు. జెర్సీ, మహర్షి టీమ్ సబ్యులందరికి ప్రత్యేకంగా కంగ్రాట్స్ అంటూ మహేష్, నాని అలాగే సినిమాకు పని చేసిన వారిని ట్యాగ్ చేసి గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











