Jaya Prakash Reddy no more: నా మామ నాకు దూరమయ్యాడు.. రవితేజ భావోద్వేగం.. వెంకీ, రామ్, సునీల్..

నటుడు జయప్రకాశ్ రెడ్డి ఆకస్మిక మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ మూగబోయింది. ఏన్నో దశాబ్దాలుగా నాటక, రంగస్టలం, సినిమా రంగాలకు విశేష సేవలు అందించిన ఆయన మంగళవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సంతాపం తెలియజేశారు. సంతాపం ప్రకటించిన వారిలో వెంకటేష్, రవితేజ, రామ్, సునీల్, మంచు లక్ష్మితోపాటు పలువురు ఉన్నారు. వారు చేసిన ట్వీట్లలో...

మా ఇద్దరిది గ్రేట్ కాంబినేషన్.. వెంకటేష్

మా ఇద్దరిది గ్రేట్ కాంబినేషన్.. వెంకటేష్

నా ప్రియమైన స్నేహతుడు జయప్రకాశ్ రెడ్డి ఆకస్మిక మరణం గురించి విన్న తర్వాత తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. మా ఇద్దరి కాంబినేషన్ తెర మీద ప్రేక్షకులను గొప్పగా ఆలరించింది. ఆయన లేకపోవడం నాకు వ్యక్తిగతం తీరని లోటు. నా విషాదవదనంతో, పగిలిన హృదయంతో చేతులెత్తి మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశారు.

రెడీ సెట్లో కలిసిన తర్వాత

రెడీ సెట్లో కలిసిన తర్వాత

నటుడు జయ ప్రకాశ్ రెడ్డ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సినిమా ప్రేక్షకులకు, మాకు ఎంతో వినోదాన్ని పంచిన ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. రెడీ సినిమా సెట్లో కలిసినప్పటి నుంచి మీరంటే ఓ ఆరాధనభావం ఉంది. ఇక మీరు లేరనే బాధ నన్ను వెంటాడుతున్నది. భగవంతుడు మీ ఆత్మకు శాంతి చూకూర్చేలా చూడాలని ప్రార్థిస్తున్నాను అని హీరో రామ్ పోతినేని అన్నారు.

నా మామకు దూరమయ్యాను..

నా మామకు దూరమయ్యాను..

గొప్ప నటుడు జయ ప్రకాశ్ రెడ్డి గారు లేరనే వార్తతో ఒక్కసారిగా తీవ్ర విషాదానికి గురయ్యాను. ఆయనను ముద్దుగా మామ అని పిలుచుకొనే వాళ్లం. మాకు ప్రత్యేకంగా ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. మామ మీ ఆత్మకు శాంతి చేకూరేలా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మాస్ మహరాజా రవితేజ ట్వీట్ చేశారు.

రెడీ షూటింగులో అంటూ జెనిలియా డిసౌజా

రెడీ షూటింగులో అంటూ జెనిలియా డిసౌజా

నటుడు జయప్రకాశ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని హీరోయిన్ జెనీలియా డిసౌజా పంచుకొన్నారు. షూటింగు సమయం మీతో గడిపిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. మీ మాటల్లో ఉట్టిపడే హాస్యంతో మనసు తేలిక పడేది. విషాదంలో మునిగిపోయిన మీ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

ఎప్పటికీ మా హృదయంలో మీరే.. సునీల్

ఎప్పటికీ మా హృదయంలో మీరే.. సునీల్

జయప్రకాశ్ రెడ్డి మరణంతో నేను తీవ్రంగా కలత చెందాను. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల, సన్నిహితులుందరికీ నా ప్రగాఢ సంతాపం. సార్ మీరు ఎప్పటికి మా హృదయాల్లో ఉంటారు. మేము ఎప్పటికీ మరిచిపోలేం అంటూ హీరో, హాస్యనటుడు సునీల్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సినిమా పరిశ్రమకు తీరని లోటు.. మెహ్రీన్

సినిమా పరిశ్రమకు తీరని లోటు.. మెహ్రీన్

గొప్ప నటుడు జయప్రకాశ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నేను విషాదంలో మునిగిపోయాను. తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. జయప్రకాశ్ రెడ్డి ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని మెహ్రీన్ పిర్దాదా పేర్కొన్నారు.

Recommended Video

Jaya Prakash Reddy : నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణం.. షాక్ లో సినీ పరిశ్రమ! || Oneindia Telugu
నాటక రంగానికి విశేష సేవలు.. లక్ష్మీ మంచు

నాటక రంగానికి విశేష సేవలు.. లక్ష్మీ మంచు

సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త వినగానే షాక్ గురయ్యాను. రంగస్థలం, నాటక రంగానికి విశేషంగా సేవలందించారు. సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు చూడ్చలేం. మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన కటుకుంబానికి నా ప్రగాఢ సంతాపం. రెండు చేతులు జోడించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తున్నాను అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారుు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X