»   » బ్రహ్మాజీ ఇంట్లో టాలీవుడ్ స్టార్స్ లేట్ నైట్ పార్టీ (ఫోటోస్)

బ్రహ్మాజీ ఇంట్లో టాలీవుడ్ స్టార్స్ లేట్ నైట్ పార్టీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే సినీ స్టార్స్ సమయం దొరికితే చాలు పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతుంటారు. ప్రకాష్ రాజ్ లాంటి కొందరు స్టార్స్ తమ ఫాం హౌస్ తమ సినీ ప్రెండ్స్ ను పిలిచి లేట్ నైట్ పార్టీలు ఇవ్వడం గతంలో చూసాం. తాజాగా బ్రహ్మాజీ ఇంట్లో గ్రాండ్ గా లేట్ నైట్ పార్టీ జరిగింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా పార్టీ చేసుకున్నారు. దీనికి పార్టీ ఏంటని ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతా గెట్‌టుగెదర్ అయి పార్టీ చేసుకోవడానికి ఇదో సాకు మాత్రమే!

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను సెలబ్రిటీ స్టైలిస్ట్, బ్రహ్మాజీ కోడలు ఇంద్రాక్షి పట్నాయక్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పార్టీలో బ్రహ్మాజీకి సన్నిహితంగా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, రానా, వరుణ్ తేజ్, నాని, సందీప్ కిషన్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా ఈ పార్టీలో సందడి చేశారు. ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.

రవితేజ, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, రెజీనా, రానా తదితరులకు ఇంద్రాక్షి పట్నాయక్ స్టైలిస్ట్‌గా తన సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో అందరినీ పిలిచి గ్రాండ్ గా మిడ్ నైట్ పార్టీ ఏర్పాటు చేసింది. మందు, విందుతో ఈ పార్టీ గ్రాండ్ గా సాగినట్లు సమాచారం. స్లైడ్ షోలో ఫోటోస్...

పార్టీ సీన్స్

పార్టీ సీన్స్

పార్టీలో రానా దగ్గుబాటి, రవితేజ, రెజీనా, నాని, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, పోనీ వర్మ, ఇంద్రాక్షి పట్నాయక్, బ్రహ్మాజీ తదితరులు.

లేట్ నైట్ పార్టీ

లేట్ నైట్ పార్టీ

లేట్ నైట్ వరకు స్టార్స్ అంతా ఈ పార్టీలో ఉంతో సందడిగా గడిపారు.

రచ్చ రంబోలా

రచ్చ రంబోలా


పార్టీలో భాగంగా స్టార్స్ అంతా సెల్ఫీలతో రచ్చరంబోలా వాతావరణ సృష్టించారు.

ఇంద్రాక్షి పట్నాయక్

ఇంద్రాక్షి పట్నాయక్

రవితేజ, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, రెజీనా, రానా తదితరులకు ఇంద్రాక్షి పట్నాయక్ స్టైలిస్ట్ గా చేస్తోంది.

మమ్మీ లవ్ యు బోత్

మమ్మీ లవ్ యు బోత్

ది ఫ్యామిలీ ఫోటో విత్ దీస్ టు! మమ్మీ లవ్స్ యు బోత్ అంటూ ఇంద్రాక్షి పట్నాయక్ ఈ ఫోటోలు పోస్టు చేసింది.

English summary
Guess what! Our crazy party freaks of Tollywood, celebrated the Children's day in a grand way. "Cause we all need no reason to get together at home. Thanks to all who made it so much fun! EverydayIsChildrensDay ", read a tweet from Indrakshi Patnaik, a celebrity stylist, who also happens to be the daughter-in-law of actor Brahmaji.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu