ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తి.. రెడ్ స్టార్ మృతి పట్ల హరికృష్ణ ఎమోషనల్ గా!
రెడ్ స్టార్ గా విప్లవాత్మక చిత్రాలతో ప్రఖ్యాతి గాంచిన మాదాల రంగారావు(70) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఆయన తెరకెక్కించిన, నటించిన విప్లవాత్మక చిత్రాలు 80 దశకంలోనే ప్రజల్లో చైతన్యాన్ని పెంచాయి. అంతలా ఆయన ప్రభావం జనాలపై ఉండేది. మాదాల రంగారావు మృతితో సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృత దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

లెనిన్ చెప్పిన మాటలు
మాదాల రంగారావు మృతి పట్ల సిపిఐ నేత నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కళ కళ కోసం మాత్రమే కాదు.. ప్రజలకోసం కూడా అని లెనిన్ చెప్పిన మాటలని ఆధునిక యుగంలో పాటించిన ఏకైన వ్యక్తి మాదాల రంగారావు అని నారాయణ కొనియాడారు.

ఎమోషనల్ గా హరికృష్ణ
నందమూరి హరికృష్ణ.. మాదాల మృతి పట్ల భావోద్వేగంతో మాట్లాడారు. నాటకరంగం నుంచి వచ్చి సినిమాల్లో అద్భుతమైన నట కనబరిచారని ప్రశంసించారు.

ఎన్టీఆర్ కు ఇష్టమైన వ్యక్తి
తన తండ్రి ఎన్టీఆర్ కు మాదాల రంగారావు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని హరికృష్ణ అన్నారు. మాదాల మృతి పట్ల వారి కుటుంబ సభ్యలకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నానని హరికృష్ణ అన్నారు.

80 దశకంలోనే
మాదాల రంగారావు విప్లవాత్మక చిత్రాలు అప్పట్లోనే ప్రజలపై ఎంతో ప్రభావం చూపాయి. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా మాదాల రంగారావు రాణించారు. మాదాల రంగారావు చిత్రాలకు అభిమానులు ఆకర్షితులయ్యేవారు. పొలిటికల్ సెటైర్, విప్లవాత్మక భావజాలంతో ఆయన చిత్రాలు ఉండేవి.


Click it and Unblock the Notifications











