నిర్మాత వడ్డే రమేష్ మృతదేహానికి సినీ ప్రముఖుల నివాళి
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేసారు. శుక్రవారం ఉదయం వడ్డే రమేష్ నివాసానికి చేరుకున్న కేంద్ర మంత్రి చిరంజీవి, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కృష్ణ, కృష్ణం రాజు, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి కళ్యాణ్, చలపతిరావు తదితరులు ఆయన మృత దేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు, కృష్ణం రాజు మాట్లాడుతూ వడ్డే రమేష్ మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఇంత త్వరగా అందరినీ విడిచి వెళ్లి పోవడం బాధిస్తుందంటూ కంటతడి పెట్టారు. ఆయనతో పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
వడ్డే రమేష్ మృత దేహానికి సినీ ప్రముఖులు నివాళ్లు అర్పించిన ఫోటోలు స్లైడ్ షోలో....

చిరంజీవి
గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వడ్డే రమేష్ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమేష్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది.

దాసరి, చిరంజీవి
వడ్డే రమేష్ ఇప్పటి వరకు పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలు తీసారు. ఎన్టీఆర్, దాసరి కాంబినేషన్లో బొబ్బిలి పులి, కృష్ణం రాజుతో కటకటాల రుద్రయ్య లాంటి హిట్స్ ఇచ్చారు. చిరంజీవితో లంకేశ్వరుడు చిత్రాన్ని నిర్మించారు.

నివాళులు అర్పిస్తున్న కృష్ణ
కృష్ణా జిల్లా యలమర్రు గ్రామానికి చెందిన వడ్డే రమేష్ కుటుంబం బెజవాడలో సెలైంది. ఆయన తనయుడు వడ్డే నవీన్ కూడా పలు చిత్రాల్లో హీరోగా పని చేసారు.

చలపతిరావు
వడ్డే రమేష్ తొలి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘పాడవోయి భారతీయుడా'. ఈ చిత్రం ద్వారా శ్రీదేవి హీరోయిన్‌గా పరిచయం చేసారు.

కె.ఎస్.రామారావు
పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ, విశ్వనాథ నాయకుడు, పండంటి కాపురం లాంటి చిత్రాలను వడ్డే రమేష్ నిర్మించారు.

రాఘవేంద్రరావు
పండండి కాపురం చిత్రాన్ని హిందీలో ‘సుర్ హరా సంసార్' పేరుతో వడ్డే రమేష్ అనువదించారు.

సి కళ్యాణ్
అమ్మకొడుకు అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు వడ్డే రమేష్.


Click it and Unblock the Notifications











