Priyanka Reddy భయానక హత్య.. ఉలిక్కిపడ్డ నగరం.. టాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్
మహానగరం హైదరాబాద్‌లో జరిగిన ప్రియాంక రెడ్డి భయానక హత్య కలకలం సృష్టించింది. ఈ హత్య తాలూకు విషయాలు తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న జనం నివ్వెరపోయారు. ఓ వైద్యురాలినే ఇలా హత్య చేసే రోజుల్లో ఇక సాధారణ మహిళకు రక్షణ ఏదని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ఘాటుగా స్పందిస్తూ, ప్రియాంక కుటుంబానికి సంతాపం తెలిపారు.

లైంగికదాడికి పాల్పడిన అనంతరం సజీవ దహనం
బుధవారం రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద కొందరు దుండగులు డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేశారు. లైంగికదాడికి పాల్పడిన అనంతరం ఆమెను సజీవ దహనం చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో నగరం నలుమూలలా జనం ఆందోళన చెందుతున్నారు.
కీర్తి సురేష్ రియాక్షన్.. భయానక పరిస్థితులు
ప్రియాంక రెడ్డి రేప్, హత్య చాలా దారుణం అంటూ ఆవేదన చెందుతూ ట్వీట్ చేసింది కీర్తి సురేష్. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఈ దుర్ఘటనలు చూస్తుంటే భయమేస్తుందని చెప్పింది. సేఫ్ సిటీగా చెప్పుకునే హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటన జరగడం నోటి వెంట మాట కూడా రానీయడం లేదని పేర్కొంది. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాని తెలిపింది.
షాకయ్యా అంటూ మెహ్రీన్ స్పందన
ప్రియాంక రెడ్డి రేప్ ఇసుఏ తెలిసి షాకయ్యా అంటూ మెహ్రీన్ ట్వీట్ చేసింది. ఇది చాలా ఘోరమైన సంఘటన అని, వెంటనే దుండగులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.
చాలా డిస్టర్బ్ అయ్యా.. సుధీర్ బాబు
ప్రియాంక రెడ్డి హత్య ఘటన గురించి తెలిసి చాలా డిస్టర్బ్ అయ్యానని సుధీర్ బాబు పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఆయన.. నా చెల్లెలంతా ఎల్లప్పుడూ పోలీసుల సహకారం తీసుకోవాలని వేడుకొన్నారు. లైవ్ లొకేషన్, యాప్స్, ఎమర్జెన్సీ నెంబర్స్ లాంటి సదుపాయాలు వాడుకోవాలని అన్నారు.
వరుణ్ సందేశ్ ఆగ్రహం
ఇదో భయానక ఘటన. ప్రియాంక రెడ్డి రేప్, సజీవ దహనం గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను ఎలా శిక్షించాలో అర్థం కావడంలేదని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ మేరకు ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపాడు.
ఆ బాధను ఊహించుకుంటేనే.. లావణ్య త్రిపాఠి
ప్రియాంక రెడ్డి హత్య ఘటన తనను చాలా డిస్టర్బ్ చేసిందని లావణ్య త్రిపాఠి పేర్కొంది. ప్రియాంక రెడ్డి, ఆమె కుటుంబ సభ్యుల ఆ బాధను ఊహించుకుంటేనే మనసు తరుక్కు పోతోందని, వెంటనే న్యాయం జరగాలని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
Recommended Video
ఘోరం.. అల్లరి నరేష్ రియాక్షన్
ప్రియాంక రెడ్డి హత్య చాలా ఘోరం, భీకరం, ఈ సంఘటన గురించి తెలిసి చాలా డిస్టర్బ్ అయ్యాను. మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ కల్పించినప్పవుడే అసలు ఫ్యూచర్ ఉంటుంది. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా అని అల్లరి నరేష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











