టాలీవుడ్ ను ఏపీకి తరలింపు..! చంద్రబాబు,పవన్ లతో సినీ ప్రముఖుల భేటీ! ఏం జరగబోతుంది.?
తెలుగు చిత్ర సీమలో గత పది రోజులుగా కాస్త గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అని మహిళా అభిమాని మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు, అరెస్ట్, రిమాండ్ తరలించడం, ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీ అల్లు అర్జున్ కు అండగా నిలబడటం, బన్నీ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలిపారు.
అయితే.. ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ సీని పెద్దలను, ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. సినీ నటులు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదనీ, అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ తీరును తప్పు పట్టారు. అల్లు అర్జున్‌ని ఓదార్చిన ప్రముఖులు.. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి.. సంధ్యా థియేటర్ గతంలో తనకు ఎలాంటి విషయాలు తెలియదని, అలాంటి ఘటనలు జరిగితే తాను అక్కడికి వెళ్లి ఉండేవాణ్ణి కాదంటూ తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.

ఈ పరిణామంపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ కూడా అల్లు అర్జున్ కామెంట్స్ పై సీరియస్ అయింది. సాక్షాదారాలతో వీడియో క్లిప్స్ లను బయటపెట్టి.. అల్లు అర్జున్ తప్పు చేశాడంటూ నిరూపించే ప్రయత్నం చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రసంగించి అల్లు అర్జున్ తప్పులను నిరూపించే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఈ ఘటన అనంతరం నిన్న అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేయడం వంటి పరిణామాలు ఇండస్ట్రీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొల్పాయని చెప్పాలి.
ఇదెలా ఉంటే.. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ లో టికెట్ రేట్లను పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాల మధ్యలో సినీ ప్రముఖులు, నిర్మాతలు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో భేటీ కాబోతున్నారని సమాచారం. ఈ మేరకు అపాయింట్ మెంట్ కోరినట్టు తెలుస్తోంది.
ఒక వేళ అపాయింట్‌మెంట్ ఇస్తే.. రెండు మూడు రోజుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు, నిర్మాతలు విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం తో భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో అల్లు అర్జున్ విషయమే కాకుండా టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు, టాలీవుడ్ సమస్యలను చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఏపీకి సినీ ఇండస్ట్రీని తరలించే ప్రయత్నాలపై చర్చలు జరిగే అవకాశం ఉందంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ ను ఏపీ తరలించాలనే ఆలోచన రావడానికి కారణాలు లేకపోలేదు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమను ఏపీకి వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. తాను కూడా సినిమా పరిశ్రమను ఏపీకి రావాలని కోరుకుంటున్నానని, సినిమా షూటింగ్లకు అందరూ విదేశాలకు పోతున్నారని, అలాకాకుండా ఏపీలోనే షూటింగ్ చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని, అన్ని విధాల ఆలోచించి టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా టిడిపి ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు కూడా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామంటూ పేర్కొన్నారు ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారని, ఏపీలో ఎన్నో షూటింగ్ పార్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే సంధ్యా థియేటర్తో కీసరట్టులో ఇంటలిజెన్స్ విఫలమైందని ఇంటలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదంటూ విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని ఫిలిం స్టార్స్ సైతం పరిస్థితి అంచనా వేసుకొని, వివరించాలని వాస్తవానికి అల్లు అర్జున్ ఆ సమయానికి ఎక్కడ వెళ్లకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
ఇలాంటి పరిణామాల మధ్య తెలుగు చిత్ర సీమను ఆంధ్రాకు తరలించబోతున్నారనే చర్చించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భేటీ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, ఒకవేళ ఈ భేటీ లో ఎలాంటి అంశాలపై చర్చించబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











