twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్ స్టార్ దారిలో.... మెగాహీరోలతో పాటు సంపూ సిద్ధం, టాలీవుడ్ మొత్తం కదులుతోంది

    ఏపీ ప్రత్యేక హోదా కోసం జరిగే మౌన దీక్షకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం చెన్నైలోని మెరీనా బీచ్ లో మొదలై... ఎంతటి తీవ్రరూపం దాల్చిందో అందరికీ తెలిసిందే. వారు వీరు అని తేడాలేకుండా పార్టీలకు అతీతంగా తమిళనాడులో ప్రతిఒక్కరూ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. కేంద్రం స్పందించి జట్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేసేలా చేసారు.

    జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం చేపట్టబోతున్న మౌన నిరసనకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తర్వాత పలువురు సినీ నటులు మద్దతు ప్రకటిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జనవరి 26న విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఏపీ యువత మౌన నిరసన కార్యక్రమం చేట్టాలని నిర్ణయించారు.

    సోషల్ మీడియాలో ఈ విషయం సర్య్కూలేట్ అవుతుండటంతో.... ఏపీ యువత ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. పలు సినీ స్టార్లు కూడా ఈ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించడంతో ఈ నిరసనకు భారీగా స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

    ఏపీ ప్రత్యేక హోదా కోసం జరిగే మౌన దీక్షకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖులు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, సందీప్‌ కిషన్‌, సంపూర్ణేష్‌బాబు, శివబాలాజీ, నిఖిల్‌, తనీష్‌, రఘు కుంచె, గోపీచంద్‌ మలినేని సోషల్‌మీడియా ద్వారా నిరసనకు మద్దతు తెలిపారు. మద్దతు పలుకుతున్న స్టార్స్ అంతా ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ తో కూడిన ఫోటోను సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ పిక్చర్ గా మార్చుకుంటున్నారు.

    టాలీవుడ్ మొత్తం కదులుతోందా?

    టాలీవుడ్ మొత్తం కదులుతోందా?

    తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా తమిళ సినీ స్టార్స్ అంతా మద్దతు పలికారు. పలువురు స్టార్స్ స్వయంగా ఆందోళనలో పాల్గొన్నారు. రజనీ, కమల్ హాసన్, సూర్య, విజయ్, లారెన్స్ లాంటి వారు జల్లికట్టు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఇదే తరహాలో ఏపీ ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమానికి టాలీవుడ్ మొత్తం కదులుతుందా? అనేది చర్చనీయాంశం అయింది.

    వరుణ్ తేజ్

    ‘ప్రజలకు మంచి చేసే ఏ పనికైనా నా మద్దతు ఉంటుంది. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్నా' అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేసారు. వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే నిదాన్ని తన ప్రొఫైల్ పిక్చర్ గా మార్చుకున్నాడు.

    సాయి ధరమ్ తేజ్

    ‘ఇది మనం సమైక్యంగా ఉండాల్సిన, ఇచ్చిన మాట కోసం పోరాడాల్సిన సమయం' అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు,

    సందీప్ కిషన్

    ‘వైజాగ్‌లో 26న జరిగే మౌన నిరసనలో బాధ్యత గల పౌరుడిగా పాల్గొంటున్నా.. మాతోపాటు చేయికలపండి' అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేసారు.

    తనీష్

    ఇపుడు మనం అంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది అంటూ తనీష్ ట్వీట్.

    సంపూర్ణేష్

    ‘మీరిస్తున్న స్ఫూర్తికి పాదాభివందనాలు. ఏపీ ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తోంది' అంటూ సంపూ మద్దతు తెలిపారు.

    శివబాలాజీ

    ‘అందరికీ ఒకటే విజ్ఞప్తి, మనస్ఫూర్తిగా మధ్యలో తొణుకు బెణుకులు లేకుండా, వెనకడుగు వేయకుండా, మనకి వాగ్దానం చేయబడిన ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాడుదాం. తెలుగు భాష రెండు రాష్ట్రాలుగా విభజనకి గురైనప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో తెలంగాణ ప్రజలు(తెలుగు ప్రజలు) అందరూ ఒక్కటిగా నిరసన తెలపాలని, పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా'. అంటూ శివ బాలాజీ పేర్కొన్నారు.

    English summary
    After Pawan Kalyan's support to the movement, several Tollywood celebrities extended their support for AP Demands Special status movement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X