సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ.. చర్చించే అంశాలివేనా?
Tollywood: తెలుగు చిత్ర సీమలో గత రెండువారాలుగా కాస్త గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం. ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలువడం, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు రోజురోజుకీ మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ పరిణామాల ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది. ఈ తరణంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలువడానికి సిద్ధమయ్యారు. ఈ కీలక భేటీకి ఎవరెవరు హాజరు అవుతున్నారు? ఈ భేటీ చర్చించబో అంశాలేంటి?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది అని చెప్పాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని, టికెట్ల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంతో టాలీవుడ్లో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని సినీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డి వీడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు గురువారం ఉదయం 10 గంటలకు కామెండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అయితే నీ భేటీలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది.. హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరో వెంకటేష్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు నిర్మాతల్లో కూడా యూవీ క్రియేషన్స్, ఏషియన్ మూవీ మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్ కూడా పాల్గొన బోతున్నారు.
ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారట. ఈ కీలక భేటీలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న, పెద్ద సినిమాలు అన్నిటికీ కూడా థియేటర్స్ సౌకర్యాలు, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రధానంగా మాత్రం సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అన్ని అంశాలు కూడా ప్రస్తావించే అవకాశముంది. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి అనుగుణంగానే ఆయన నిర్ణయాలను తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











