బీఏ రాజు నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. జయ మృతికి మహేష్, సుకుమార్, వెంకటేష్ సంతాపం!

Recommended Video

Tollywood Celebs Pay Homage To Director B Jaya

టాలీవుడ్ దర్శకురాలు బి జయ శుక్రవారం ఉందయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నందమూరి హరికృష్ణ మరణంతో షాక్ లో ఉన్న టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. సినీ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు సతీమణి జయ. జయ మరణంతో బిఎ రాజు కుటుంబ సభ్యులలో విషాదం నెలకొంది. టాలీవుడ్ సినీప్రముఖులు బిఎ రాజు నివాసానికి చేరుకొని జయ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

 వెంకటేష్

వెంకటేష్

వెంకటేష్ మాట్లాడుతూ.. జయ దర్శకురాలు కాకముందు నుంచే తనకు జర్నలిస్ట్ గా తెలుసు అని వెంకీ తెలిపాడు. తక్కువ వయసులోనే మృతి చెందడం బాధాకరమని వెంకీ ఆమెకు నివాళులు అర్పించాడు.

 చెన్నైలో ఉన్నప్పుడే

చెన్నైలో ఉన్నప్పుడే

జయ తనకు చిన్ననాటి నుంచే తెలుసు అని నరేష్ తెలిపాడు. ఆమెది కూడా న వయసే. చెన్నైలో ఉన్నప్పుడే రచయితగా, జర్నలిస్ట్ గా రాణించేది. రచయితగా మంచి స్థాయికి చేరుకుంటావని చెన్నైలో ఉన్నప్పుడే ఆమెకు చెప్పా. అనుకున్నట్లుగానే దర్శకురాలిగా మారి విజయం సాధించిందని నరేష్ తెలిపాడు.

 రెండేళ్ల నుంచి

రెండేళ్ల నుంచి

ఇండస్ట్రీలో రెండేళ్ల నుంచి ఇలా విషాదకర ఘటనలు జరుగుతున్నాయని నరేష్ అభిప్రాయపడ్డాడు. మంచు మనోజ్ కూడా జయకు నివాళులు అర్పించాడు. హరికృష్ణ గారి మరణం తరువాత ఇండస్ట్రీకి మరో షాక్ తగిలిందని మనోజ్ తెలిపాడు.

 చంటిగాడు హీరోయిన్

చంటిగాడు హీరోయిన్

జయ దర్శత్వం వహించిన తొలి చిత్రం చంటిగాడు. ఈ చిత్రంలో నటి సుహాసిని హీరోయిన్ గా నటించింది. జయ మృతి పట్ల సుహాసిని భావోద్వేగానికి గురైంది. చాలా చిన్న వయసులో ఆమె చిత్రంలో హీరోయిన్ గా నటించా. నాకు దగ్గరుండి అన్ని నేర్పించారు. ఆమె నాకు తల్లితో సమానం అంటూ సుహాసిని కన్నీరు పెట్టుకుంది.

మహేష్, సుకుమార్

మహేష్, సుకుమార్

మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్, వంశీ పైడిపల్లి జయ మృతిపట్ల సంతాపం తెలియజేసారు. హీరో ఆది మాట్లాడుతో లవ్లీ చిత్రంతో జయగారు నాకు మంచి హిట్ ఇచ్చారు. అప్పుడప్పుడూ ఫోన్ చేసి, ఇంటికి వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఆమె ఆకస్మికంగా మరణించడం నమ్మలేకున్నానని ఆది తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X