twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆహుతి’ అంత్యక్రియలు: ఎన్టీఆర్, వినాయక్, రాజశేఖర్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆహుతి ప్రసాద్ మరణం తెలుగు చిత్ర సీమను విషాదంలో ముంచెత్తింది. ఆహుతిప్రసాద్‌ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరిగాయి. ఆయన కుమారుడు ఆహుతిప్రసాద్‌ చితికి నిప్పంటించడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సోమవారం ఉదయం ఫిల్మింనగర్‌ నుంచి ఎర్రగడ్డ శ్మశాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలు అభిమానులు తరలివచ్చారు.

    ఆహుతి ప్రసాద్ మంచి నటుడిగానే కాదు, పరిశ్రమలో పలువురికి ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన క్యాన్సర్ తో మృతి చెందాడన్న విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు నిన్న ఆయన నివాసానికి చేరుకుని నివాళుల అర్పించారు. ఎన్టీఆర్, వివి వినాయక్, రాజశేఖర్, అలీ, శివాజీ రాజా, సురేఖ వాణి తదితరులు కంటతడి పెట్టారు. అజాతశత్రువు అనే పదానికి సిసలైన ఉదాహరణ ఆహుతి ప్రసాద్. ఆయన లేని లోటు తీర్చలేనిది అని జూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆహుతి ప్రసాద్ కష్టించి పనిచేసేవారు చాలా ధైర్యవంతుడు. నేను హీరోగా నటించిన ఆహుతి చిత్రంతో ఆయన పేరు ఆహుతి ప్రసాద్‌గా మారింది. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు రాజశేఖర్.

    ఆహుతి ప్రసాద్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. నటుడిగా, విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారాయన. చిన్న వయసులోనే ఆయన తనువు చాలించడం బాధగా వుంది అన్నారు పరుచూరి గోపాల కృష్ణ. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న అతికొద్ది మంది నటుల్లో అహుతి ప్రసాద్ ఒకరు. చిన్న పాత్రలతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు నటుడు శ్రీకాంత్.

    స్లైడ్ షో ఫోటోలు...

    నివాళులు అర్పిస్తున్న ఎన్టీఆర్

    నివాళులు అర్పిస్తున్న ఎన్టీఆర్


    ఆహుతి ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న సినీ నటుడు ఎన్టీఆర్.

    రాజశేఖర్

    రాజశేఖర్


    ఆహుతి ప్రసాద్ భౌతిక కాయం వద్ద విషాద వదనంతో నటుడు రాజశేఖర్.

    వివి వినాయక్

    వివి వినాయక్


    ఆహుతి ప్రసాద్ ఆఖరి చూపుకోసం ఆయన నివాసానికి చేరుకున్న దర్శకుడు వివి వినాయక్.

    క్యానర్స్

    క్యానర్స్


    గత కొంత కాలంగా ఆహుతి ప్రసాద్ కేన్సర్ తో బాధ పడుతున్నారు.

    ఎవరికీ తెలియకుండా...

    ఎవరికీ తెలియకుండా...


    తనకు ఉన్న జబ్బు విషయం తెలిపి మరెవరినీ బాధ పెట్టడం ఇష్టం లేకుండా ఆయన ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతూ వచ్చారు.

    మంచి వ్యక్తి

    మంచి వ్యక్తి


    ఆహుతి ప్రసాద్ చిత్ర పరిశ్రమలో మంచి వ్యక్తిగా, మృదు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు.

    ఓదార్పు

    ఓదార్పు


    ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాజశేఖర్, వివి వినాయక్.

    శివాజీ రాజా

    శివాజీ రాజా


    ఒకప్పుడు శివాజీరాజా, ఆహుతి ప్రసాద్ కలిసి ఒకే యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో కలిసి శిక్షణ తీసుకున్నారు. తన మిత్రుడి మరణంతో విషాదంలో మునిగి పోయారు.

    ఆలీ

    ఆలీ


    ఆహుతి ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న అలీ.

    విషాదం

    విషాదం


    ఆహుతి ప్రసాద్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

    శ్రీకాంత్

    శ్రీకాంత్


    ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న శ్రీకాంత్ తదితరులు...

    కష్టనష్టాలకు ఎదురీది

    కష్టనష్టాలకు ఎదురీది


    ఎన్ని కష్టనష్టాలకు ఎదురీదినా ఆహుతి ప్రసాద్ నటనను మాత్రం వదులుకోలేదు. విక్రమ్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఆయన నిన్నే పెళ్లాడతా చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

    నంది అవార్డులు

    నంది అవార్డులు


    నిన్నె పెళ్లాడతా చిత్రంతో పాటు చందమామ చిత్రాలకు ఆహుతి ప్రసాద్ నంది అవార్డులు అందుకున్నారు.

    250పైగా చిత్రాలు

    250పైగా చిత్రాలు


    ఇప్పటి వరకు ఆయన 250కి పైగా చిత్రాల్లో నటించారు.

    గోదావరి యాసతో...

    గోదావరి యాసతో...


    ఆహుతి ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా గోదావరి యాసతో కూడిన క్యారెక్టర్లు చేస్తూ ఆకట్టుకున్నారు.

    అబద్దం చెప్పి...

    అబద్దం చెప్పి...


    ఈ మధ్య ఆయన్ను కలిసిన కొందరు బక్క చిక్కిపోయావని అడిగితే...వారిని బాధ పెట్టడం ఇష్టం లేక క్యాన్సర్ విషయాన్ని దాచి....ఓ సినిమాలోని పాత్ర కోసం ఇలా చేస్తున్నట్లు అందంగా అబద్దం చెప్పారు.

    అందరితో కలివిడిగా...

    అందరితో కలివిడిగా...


    పరిశ్రమలో ఆహుతి ప్రసాద్ అందరితో కలివిడిగా ఉండే వారు.

    విషాదంలో కుటుంబం

    విషాదంలో కుటుంబం


    ఆహుతి ప్రసాద్ మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగి పోయింది.

    ఓదార్పు

    ఓదార్పు


    ఆయన కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు ఓదార్చారు.

    English summary
    Tollywood celebrities visited late actor Ahuti Prasad's residence to meet the actor's family and paid homage after he passed away at a private hospital in Secunderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X