చక్రి మృతి పట్ల చిరంజీవి, బాలయ్య, రామానాయుడు సంతాపం
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు చక్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, నటుడు నందమూరి హరికృష్ణ, నిర్మాత రామా నాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేసారు. చక్రి మరణ వార్తను నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి అని, అలాంటివారు దూరం కావడం బాధాకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి కుటుంబ సభ్యులకు రామానాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయం తెలిసిన వెంటనే బాలయ్య చక్రి ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.
చక్రి ఇక లేడనే వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని సంగీత దర్శకురాలు, గాయని శ్రీలేఖ అన్నారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడానని చెప్పారు. చక్రి మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారని చెప్పారు. 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే పాటను ఆయన ఎందుకు కంపోజ్ చేశారో తెలియదు కానీ... అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ అన్నారు.

నిద్రలోనే...
అనతి కాలంలోనే అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన చక్రికి వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువ. ఎప్పుడు చూసినా తన పనుల్లో బిజీగానే ఉండేవారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆదివారం అర్ధరాత్రి దాకా ఆయన రికార్డింగ్ థియేటర్ లోనే గడిపారు. అర్ధరాత్రి దాటాక పని ముగించుకుని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయారు. నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు.


Click it and Unblock the Notifications











