twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం గురించి ఎవరేమన్నారు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : అందరిలో ఆసక్తి రేపిన అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసింది. ప్రస్తుతం సమాజంలో మామూలైపోయిన నిర్లక్ష్య ధోరణులివి. వీటిని నిలువరించడం అంటే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడమే. ఇదీ దేశసేవ కిందకే అంటూ చేసిన ఈ షార్ట్ పిలిం అంతటా ప్రసంశలు పొందుతోంది.

    సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బండి నడపడం, పరీక్షల్లో కాపీ కొట్టడం, చెత్తను రోడ్డుపై పడేయడం, సెలబ్రిటీలకు అసాధారణ సౌకర్యాలు కల్పించడం... ఆయన స్వీయ నిర్మాణంలో నటిస్తూ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. 'ఐ యామ్‌ దట్‌ ఛేంజ్‌' పేరుతో తెరకెక్కిన ఈ లఘుచిత్రానికి సుకుమార్‌ దర్శకుడు.

    ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఏమన్నారు... అనేది స్లైడ్ షోలో చూద్దాం

    రాజమౌళి

    రాజమౌళి

    "ఐ యామ్ దట్ ఛేంజ్ !!! వందేమాతరం!!! మనస్పూర్తిగా సుక్కూ, బన్నీలను అభినందిస్తున్నా !!!".

    రానా

    రానా

    " హ్యాపీ ఇండిపెండెన్స్ డే... మీకు కావాల్సిన ఆ మార్పుని మీరే కండి... స్వీట్ గా చిన్నగా షార్ట్ పిల్మ్ ఫిల్మ్ చేసిన అల్లు అర్జున్, సుకుమార్ లకు శుభాకాంక్షలు...."

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    "బన్నీకు నేను సెల్యూట్ చేస్తున్నా... మన చుట్టూ ఉండేవాళ్లు మారాలి అనుకోవటం కన్నా మనమే ఆ మార్పు కావచ్చు కదా..మీరే ఆ మార్పు కండి...సూపర్బ్

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...

    ''స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఏదైనా మంచి విషయం చెప్తే బాగుంటుందని అనిపించింది. ఆ ఆలోచనలో భాగమే ఈ 'ఐ యామ్‌ దట్‌ ఛేంజ్‌'. సుకుమార్‌కి ఈ విషయం చెప్పగానే ఒక్క రోజులోనే మంచి కాన్సెప్ట్‌ రాసుకున్నాడు. అంత వేగంగా కాన్సెప్ట్‌ చేసేవారిలో సుకుమార్‌ ఒకరని చెప్పొచ్చు. 'మన కర్తవ్యం నిర్వహించడం కూడా దేశసేవే అవుతుంది' అనేది ఈ లఘుచిత్ర ప్రధానాంశము''అన్నారు.

    అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తూ...

    అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తూ...

    లఘుచిత్ర నిర్మాణంలో ఇబ్బందులు గురించి చెబుతూ ''నేనో పెద్ద నిర్మాత కొడుకుని. హీరోగా పరిశ్రమలో నాకంటూ పేరు ఉంది. అలాంటి నాకే లఘుచిత్రం తీద్దామంటే ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటిది మనసులో ఆలోచన, గుండెలో మంచి సినిమా చేయాలనే కోరిక, చేతిలో కెమెరాతో చాలామంది యువత లఘుచిత్రాలు తీస్తున్నారు. వారి పట్టుదలకు, నిబద్ధతకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అన్నారు అల్లు అర్జున్‌.

    సుకుమార్‌ మాట్లాడుతూ....

    సుకుమార్‌ మాట్లాడుతూ....

    ''బన్నీకి ఎప్పటినుంచో దేశసేవ అనే అంశం మీద లఘుచిత్రం చేయాలని ఉండేది. ఒకరోజు నన్ను పిలిచి 'ఆగస్టు 15 సందర్భంగా ఓ లఘుచిత్రం చేద్దాం సిద్ధంగా ఉండు' అని చెప్పాడు. వెంటనే ఈ అంశంపై కాన్సెప్ట్‌ సిద్ధం చేసుకున్నాను. నా సినీ జీవితంలో ఆత్మసంతృప్తి అందించిన చిత్రమిది. దీని టైటిల్స్‌లో 'దర్శకుడు సుకుమార్‌' అని నా పేరు చూసి గర్వపడుతున్నాను. అల్లు అర్జున్‌ ఇలాంటి ఆలోచన చేయడం ప్రశంసనీయం'' అన్నారు.

    English summary
    Allu Arjun has been floored with appreciation calls ever since his short film 'I AM THAT CHANGE' hit the web.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X