మహర్షి: మహేష్ బాబు పట్ల ప్రేమ, గౌరవం చాటుకున్న టాలీవుడ్ తారలు

Recommended Video

Tollywood Celebrities Tweets On Mahesh Babu And Maharshi Movie || Filmibeat Telugu

మహేష్ బాబు, పూజా హెడ్గే హీరో హీరోయిన్లుగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో రూపొందించిన చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మించారు. సూపర్ స్టార్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం మరో విశేషం. మహేష్ బాబు తొలిసారిగా మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఈ మూవీ రూపొందించారు. మహేష్ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన మూవీ కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు టాలీవుడ్ సూపర్ స్టార్‌ను ట్విట్టర్ ద్వారా విష్ చేశారు.

'మహర్షి' చిత్రానికి భారీగా డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లొకేషన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. బాహుబలి తర్వాత తెలుగులో ఎక్కువ థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

సుధీర్ బాబు

బాబు ల్యాండ్ అవుతున్నాడు. మహర్షి రిలీజ్ సందర్భంగా సూపర్ స్టార్‌కు, వంశీ పైడిపల్లికి, దిల్ రాజు అన్నకు, అశ్వినీదత్ గారికి, పావిపి గారికి శుభాకాంక్షలు. పూజా హెగ్డే, డీఎస్పీ, ఎంటైర్ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. మహేష్ బాబు 25వ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుందాం.

ఆర్ఎక్స్ 100 కార్తికేయ

మహేష్ బాబు సర్, మహర్షి టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ 25వ సినిమా ప్రతి ఒక్కరికీ మంచి అనుభూతి పంచాలి. మీరు ఈ రోజు ‘మహర్షి' సినిమాకు వెళుతున్నట్లయితే ‘హిప్పి' ట్రైలర్ కూడా మీరు చూస్తారు.

గుణశేఖర్

మహేష్ బాబుకు ‘ఒక్కడు' లాంటి కెరీర్ టర్నింగ్ హిట్ అందించిన దర్శకుడు గుణశేఖర్ ‘మహర్షి' చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి' గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.

మెహర్ రమేష్

డైరెక్టర్ వంశీ, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే, దిల్ రాజు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ‘మహర్షి' మూవీ ద్వారా అద్భుతమైన ఫలితాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

‘మహర్షి' జర్నీలో భాగం అవ్వండి

అందరూ ఎదురు చూస్తున్న ‘మహర్షి డే' వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు రిషిగా మొదలు పెట్టిన ప్రయాణంలో భాగం అవ్వండి. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచే మూవీ ఇది... అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు.

శాలిని పాండే

‘అర్జున్ రెడ్డి' మూవీ హీరోయిన్ శాలిని పాండే ‘మహర్షి' చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేసింది. సూపర్ స్టార్ మూవీ ఘన విజయం అందుకోవాలని, డైరెక్టర్ వంశీ ఖాతాలో మరో విజయవంతమైన చిత్రంగా ‘మహర్షి' ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

సుశాంత్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ‘మహర్షి' చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ, పూజా హెగ్డే, అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి, చిత్ర బృందాన్ని విష్ చేస్తుట్లు పేర్కొన్నారు.

ఏఆర్ మురుగదాస్

‘మహర్షి' చిత్రం భారీ విజయం అందుకోవాలని, మహేష్ బాబు సర్ ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు దర్శకుడు మురుగదాస్ ట్వీట్ చేశాడు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో ‘స్పైడర్' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

సీనియర్ నరేష్

ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ ‘మహర్షి' మూవీ రిలీజ్ సందర్భంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. మా ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ 25వ చిత్రం భారీ విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి ‘మహర్షి' చిత్ర బృందం విజయం అందుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. ‘మహర్షి' మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X