ఆల్రెడీ ‘ఓ బేబీ’ సినిమా చూశారు... సమంత మూవీ ఎలా ఉందంటే?
సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ బేబీ'. గురువారం ఉదయం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ సమంత 70 ఏళ్ల వృద్దురాలిగా, 24 ఏళ్ల పడుచు పిల్లలా నటించడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ఈ ట్రైలర్‌పై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, సమంత పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు నాగార్జున, నాగ చైతన్య మరికొందరు సెలబ్రిటీలకు ఈ సినిమా ఇప్పటికే ప్రత్యేక షో వేసి చూపించారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వారు ఈ సినిమాపై అభిప్రాయం వెల్లడించారు.
70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా..
‘‘ఓ బేబే సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. సమంత 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి గా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది.'' అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.
మా కోడలు మరో హిట్టు కొట్టడం ఖాయం
అక్కినేని నాగార్జున స్పందిస్తూ...‘చాలా నచ్చింది కోడలా.. నువ్వు మరో హిట్టు కొట్టడం ఖాయం' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమంత స్పందిస్తూ మీ మాట తప్పకుండా నిజం అవుతుందనే నమ్మకం ఉంది అంటూ రిప్లై ఇచ్చింది.
నా మొగుడు గ్రేటెస్ట్
నాగ చైతన్య స్పందిస్తూ... ‘ట్రైలర్ చాలా బావుంది. సినిమా ఇంతకంటే బావుంటుంది. ఓ బేబీ సినిమాకు పని చేసిన అందరికీ కంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై సమంత స్పందిస్తూ ‘నా మొగుడు గ్రేటెస్ట్' అంటూ రిప్లై ఇచ్చింది.
రాహుల్ రవీంద్రన్
‘ఓ బేబీ' నచ్చింది. మా గ్రాండ్ మదర్ తన జీవితం మొత్తాన్ని తనకు నచ్చిన విధంగా మళ్లీ జీవించే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే ఎంతో బావుంది. సమంత అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. దర్శకురాలు నందినీరెడ్డితో పాటు టీమ్ మొత్తానికి సూపర్ లక్... అంటూ రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు.

ప్రముఖుల ప్రశంసలు
రకుల్, బివిఎస్ రవి, తమన్, శోభు యార్లగడ్డ, సుశాంత్, సందీప్ కిషన్, తాప్సీ, వెన్నెల కిషోర్, అడవి శేష్, తరణ్ ఆదర్శ్, ప్రదీప్ మాచిరాజు, ఇషా రెబ్బ, విజయ్ దేవరకొండ తదితరులు ‘ఓ బేబీ' ట్రైలర్ మీద ప్రశంసలు గుప్పించారు. ఉదయం విడుదలైన ట్రైలర్ ఆల్రెడీ 2 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ క్రాస్ అయింది.


Click it and Unblock the Notifications











