డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా పైకి రాలేవు అన్నాడు: అమ్మా రాజశేఖర్ పై సమీర్ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 4లో అమ్మ రాజశేఖర్ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తమిళ్, తెలుగు మిక్స్ చేస్తూ ఆయన వదులుతున్న డైలాగ్స్ ఒక వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక అమ్మ రాజశేఖర్ చాలా వరకు షోలో కొన్ని ఎమోషనల్ స్టోరీలను కూడా పంచుకున్నారు. నేను ఎవరికైనా సహాయం చేయడానికి ట్రై చేస్తానని చెప్పాడు. అయితే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ హాసన్ మాత్రం ఆయనపై ఎవరు ఊహించని విధంగా స్పందించారు.

ఇంట్లో కూడా పని చేయించుకున్నాడు
ఇదివరకే జబర్దస్త్ కమెడియన్ పవన్ అమ్మ రాజశేఖర్ తనను మోసం చేసినట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎలాగైనా సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని తనను పర్సనల్ పనులకు వాడుకున్నాడని, ఇంట్లో కూడా పని చేయించుకున్నట్లు పవన్ ఒక ఇంటర్వ్యూలో సంచాలం ఆరోపణలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ న్యూస్ అప్పట్లో వైరల్ అయ్యింది.

డబ్బు కోసం ఇబ్బంది పెట్టలేదు
ఇక సమీర్ కూడా అమ్మా రాజశేఖర్ తనతో వ్యవహరించిన తీరుపై ఒక ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. సమీర్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఎప్పుడు కూడా డబ్బు విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ అమ్మా రాజశేఖర్ ఒకసారి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ విషయంలోనే చాలా బాధపెట్టారు.

డబ్బులు ఇవ్వలేదని రాలేదా?
అమ్మా రాజశేఖర్ తో సినిమా చేస్తున్నప్పుడు కూడా డేట్స్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సడన్ గా డేట్స్ అడుగుతూ ఉంటారు. వెంటనే ఓకే చెప్పకపోతే వేరే విధంగా మాట్లాడతారు. ఆయన అడిగిన సమయంలో నాకు వేరే షూటింగ్ ఉంది అన్నప్పుడు ముందే డబ్బులు ఇవ్వలేదని రాలేదా? అని అన్నాడు.

చాలా బాధగా అనిపించింది.
ఆ మాటకు చాలా బాధగా అనిపించింది. నీ డబ్బులు ఎలాగైనా ఇస్తాను అంటూ ఆయాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నాకు ఆయనకు చాలా క్లోజ్ అయినప్పటికి ఆ మాటలకు ఫీల్ అయ్యాను. నేను డబ్బు విషయంలో ఇంతవరకు ఇబ్బంది పెట్టిన రికార్డ్ లేదు. సినిమాలే కాకుండా టీవీలలో కూడా చేశాను. డబ్బులు ఇస్తేనే షూటింగ్ కి వస్తానని నేను ఏనాడు చెప్పలేదు.
Recommended Video

నాకు రావాల్సిన డబ్బులు కూడా రాలేదు..
అయితే అమ్మా రాజశేఖర్ రేపు షూటింగ్ కి వస్తావా రావా? అని గట్టిగా అనేసరికి.. రేపు వేరే షూటింగ్ ఉంది. వాళ్ళకు డేట్స్ ఇచ్చిన ప్రకారం వెళ్ళాలి కదా అని క్లారిటీగా చెప్పేశాను. అందుకు ఆయన నువ్ అన్ ప్రొఫెషనల్ అంటూ ఇలా ఉంటే పైకి రాలేవని అన్నారు. ఆ మాటలతో సినిమా నుంచి తప్పుకున్నాను. కనీసం నాకు రావాల్సిన డబ్బులు కూడా రాలేదు.. అని యాక్టర్ సమీర్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











