twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ బెంగాల్ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Actress Shruthi Challenges Tollywood Top Heroes Producers

    పవన్ కళ్యాణ్ బెంగాల్ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడా?.... ఇదీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి బుర్రలను తొలుస్తున్న ప్రశ్న. 'సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్' అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శృతి పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు.

    పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్

    పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్

    పవన్ కళ్యాన్ తన ఫ్యాన్స్ అందరినీ అడ్డం పెట్టుకుని పాలిటిక్స్‌లోకి వచ్చి ఇంకా సంపాదించుకుంటున్నాడు. అమరావతిలో ఇల్లు కొన్నాడు. కేవలం సినిమాలు చేసే ఆయన ఇదంతా సంపాదించాడా? సినిమాల్లో పవన్ కళ్యాణ్‌కు హిట్లే లేవు. అరకొర హిట్లతో ఇదంతా ఎలాసాధ్యమైంది అంటూ.... శృతి ప్రశ్నించారు.

    బెంగాల్ అమ్మాయిలతో మసాజ్

    బెంగాల్ అమ్మాయిలతో మసాజ్

    మహిళలు ఎవరూ పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయవద్దు. పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసా?....ఆయనకు మసాజ్‌ చేయడానికి బెంగాల్ అమ్మాయిలు కావాలి. ఇది చాలా మందికి తెలియదు. ఆయనకు మసాజ్ చేయడానికి వెళ్లిన అమ్మాయిలు రేపు వచ్చి చెబుతారు.... అంటూ శృతి ఆరోపించారు.

    టాలీవుడ్ పెద్ద హీరోలకు పొగరు

    టాలీవుడ్ పెద్ద హీరోలకు పొగరు

    తెలుగులో ఉన్న పెద్ద హీరోలకు పొగరు. ఈ ముండలు మాట్లాడితే మేము రావాలా? అనే మెంటాలిటీతో ఉంటారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశంపై జరుగుతున్న ఈ పోరాటానికి చాలా మంది పెద్ద ఆర్టిస్టుల సపోర్టు కూడా ఉంది. కానీ వాళ్లు వస్తే వాళ్ల జీవితాలు నాశనం అవుతాయి. మేము ఆల్రెడీ దిగాము. ఈ పోరాటంలో సమిధలు అవుదామని, బలవుదామనే వచ్చాము.... అని శృతి తెలిపారు.

    రామనాయుడు లాంటి వారు ఇపుడు లేరు

    రామనాయుడు లాంటి వారు ఇపుడు లేరు

    అప్పట్లో రామానాయుడు గారు సినిమాలు తీశారు... సినిమా అంటే ఆయనకు పిచ్చి, పాషన్, అందుకే ఆస్తులు అమ్మి తీశాడు. ఇపుడు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇలా నలుగురు పెద్దలు ఉన్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా మరో 10 తరతరాలు కూర్చుని తినేలా సంపాదిస్తున్నారు.... అని శృతి ఫైర్ అయ్యారు.

    ఆ కోతి మొహాలు హీరోలు... మేము హీరోయిన్లుగా పనికిరామా?

    ఆ కోతి మొహాలు హీరోలు... మేము హీరోయిన్లుగా పనికిరామా?

    అన్నీ సినిమాల్లో వాళ్ల హీరోలే... వాళ్ల మనవళ్లే... ఒక్క మొహమైనా బావుంటుందా? అన్నీ కోతి మొహాలే... 30 సర్జరీలు చేస్తేగానీ వారికి షేపులు రావు. ఒక్క హీరో అయినా హైట్ ఉంటాడా? ఎవరో కొంత మంది తప్ప మిగతా వారు హీరోలుగా పనికొస్తారా? ఈ విషయం జనాలకు కూడా తెలుసు?... వారంతా హీరోలుగా పనికి వస్తారు కానీ తెలుగు వారు హీరోయిన్లుగా పనికి రారా? అంటూ శృతి మండి పడ్డారు.

    English summary
    Tollywood character artist Shruthi shocking comments on Pawan Kalyan. Shruthi lashed out at the so-called 'heroes' and 'heroines' of Tollywood, who have not come out in the open to support them. Urging women not to vote for Jana Sena Party chief, Pawan Kalyan, she said that he 'wants Bengali women for massage.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X